బొప్పాయి సాగులో గుండ్రని మచ్చ తెగులను నివారించే పద్ధతులు..!

బొప్పాయి సాగును( Papaya Cultivation ) ఆశించే గుండ్రని మచ్చ తెగులు( Round Spot Rot ) అనేది పెంకు పురుగు జాతుల వలన వ్యాపిస్తుంది.

ఈ తెగులు సోకిన కొద్ది సమయంలోనే వ్యాప్తి అనేది అధికంగా ఉంటుంది.వాతావరణం చల్లగా ఉన్న సమయాలలో బొప్పాయి మొక్క ఆకులపై, బొప్పాయి కాయలపై గుండ్రని మచ్చ తెగుల లక్షణాలను గుర్తించవచ్చు.

బొప్పాయి కాయలపై ముదురు ఆకుపచ్చని వృత్తాకారమచ్చలు ఏర్పడతాయి.ఆకులపై పసుపు రంగు చారలు కనపడతాయి.

ఈ తెగులు పంటను ఆశించకుండా, ఒకవేళ ఆశిస్తే ఎలా అరికట్టాలో తెలుసుకుందాం. """/" / తెగులు నిరోధక ఆరోగ్యమైన విత్తనాలను మాత్రమే నాటుకోవాలి.

ఈ పంట సాగుకు తెగులు సోకే అవకాశం లేని ప్రాంతంలో మాత్రమే సాగు చేయాలి.

బొప్పాయి తోట( Papaya Crop ) చుట్టూ మొక్కజొన్న లేదా హైబిస్కస్ శబ్దారిఫా మొక్కలను వేస్తే వివిధ రకాల తెగులు ఆశించే అవకాశం ఉండదు.

బొప్పాయి పంట సాగు చేస్తున్న సమీపంలో దోస జాతి పంటలు సాగు చేయకూడదు.

మొక్కలకు వైరస్ సోకింది అనే అనుమానం కలిగితే వెంటనే ఆ మొక్కలను పంట నుండి వేరు చేసి కాల్చి నాశనం చేయాలి.

పొలంలో ఎప్పటికప్పుడు కలుపులు తొలగిస్తూ ఉండాలి.వలలు వాడడం వలన క్రిములు వైరస్ వ్యాపించకుండా పంట సంరక్షించబడుతుంది.

"""/" / పంట పొలంలో ఏవైనా వైరస్ లేదా తెగులు గుర్తించినప్పుడు మొదటగా సేంద్రియ పద్ధతిలో నివారణ చర్యలు చేపట్టాలి.

తెలుపునూనె రసాయనాలు ఒక శాతం శాతం నీటితో కలిపి పిచికారి చేయాలి.సూక్ష్మజీవుల బ్యాక్టీరియా, ఈస్ట్, అక్తినోమైసీడ్స్, ఫోటో సింథటిక్ బ్యాక్టీరియా లాంటివి ఉపయోగించి బొప్పాయి పంటను తెగులు నుండి సంరక్షించవచ్చు.

ఒకవేళ తెగుల వ్యాప్తి అధికంగా ఉంటే డై-మేథోయెట్, అజాడిరక్తిన్ లాంటి రసాయన పిచికారి మందులను ఉపయోగించి పంటలు సంరక్షించుకోవాలి.

ప్రతి రెండు వారాలకు ఒకసారి పిచికారి చేస్తే ఈ తెగులు పూర్తిగా అరికట్టబడతాయి.

ముఖ్యమంత్రికి కోటి రూపాయల చెక్కును అందజేసిన ఉపముఖ్యమంత్రి పవన్..