సోయా పంటలో పల్లాకు తెగులును నివారించే పధ్ధతులు..!
TeluguStop.com

సోయా పంట( Soya Bean Crop )కు తీవ్ర నష్టం కలిగించే తెగులలో పల్లాకు తెగులు కీలక పాత్ర పోషిస్తాయి.


ఈ తెగులను తోలి దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేయాలి.అప్పుడే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.


సాధారణంగా పంటలకు చీడపీడల,తెగుళ్ల బెడద ఉండకూడదు అంటే వేసవికాలంలో లోతు దుక్కులు దున్నుకోవాలి.
ఇలా చేస్తే భూమిలో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ లకు చెందిన అవశేషాలు పూర్తిగా సూర్యరశ్మి తగిలి నాశనం అవుతాయి.
తరువాత పంట పొలంలో ఏవైనా పంటకు సంబంధించిన అవశేషాలు ఉంటే పూర్తిగా తొలగించాలి.
సేంద్రియ ఎరువు( Organic Manure )లు వేసి పొలాన్ని కలియ దున్ని ఆ తర్వాత పొలాన్ని పరిశుభ్రం చేయాలి.
ఈ సూచనలను పాటిస్తే దాదాపుగా తెగుళ్ల, చీడపీడల బెడద చాలా తక్కువగా ఉంటుంది.
పంట పొలంలో ఎప్పటికప్పుడు కలుపును నివారించే చర్యలు చేపట్టాలి.పొలానికి నీటి తడులు రాత్రి కాకుండా కేవలం పగటిపూట మాత్రమే అందించాలి.
మొక్కల మధ్య సూర్యరశ్మి బాగా తగిలే విధంగా కాస్త దూరంగా విత్తుకోవాలి. """/" /
ఇక సోయా పంటకు పల్లాకు తెగులు ఆశిస్తే.
ఆకుల్లోని పత్రహారం అంతా వైరస్ తినేస్తుంది.మొక్క ఎండిపోవడం మొదలవుతుంది.
ఈ వైరస్ పంటకు వ్యాప్తి చెందడంతో మొక్కలు పూర్తిగా పసుపు వర్ణం లోకి మారుతాయి.
ముఖ్యంగా సోయా పంట పూత, పిందె, కాయ దశలో ఉన్నప్పుడు ఈ తెగులు పంటను ఆశించే అవకాశం ఉంది.
"""/" /
కాబట్టి పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఈ పల్లాకు తెగులు సోకిన మొక్కలను గుర్తించి వెంటనే గీకి కాల్చివేయాలి.
ఆ తర్వాత ఈ తెగులను నివారించడం కోసం ఒక ఎకరం పొలంలో 400 మి.
ల్లి ల ట్రైజోపాస్( Triazophos ) ను లీటర్ నీటిలో కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
లేదంటే 300గ్రా.ఎస్పీపేట్ ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.