మల్లెపూల తోటలను ఆశించే ఆకు మచ్చ, ఎండు తెగుళ్లను నివారించే పద్ధతులు..!

మల్లెపూలకు ( Jasmine Flowers )వేసవి కాలంలో మంచి డిమాండ్ ఉంటుంది.మల్లెలను ఒకసారి నాటితే దాదాపుగా 12 సంవత్సరాల పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది.

కాకపోతే మల్లె తోటలను ఆశించే చీడపీడల, తెగుళ్ల గురించి అవగాహన ఉంటేనే పంటను సంరక్షించుకుని అధిక దిగుబడి( High Yield ) సాధించగలం అని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.

మల్లె తోటలలో కీలకం కొమ్మ కత్తిరింపులు మరియు తొలి దశలోనే తెగుళ్లను, చీడపీడలను అరికట్టడం.

ఈ రెండింటి పై అవగాహన ఏర్పడిన తర్వాతనే మల్లె తోటలను సాగు చేయాలి.

"""/" / మల్లె తోటలను సాగు ( Jasmine Cultivation )చేసే నేలను ముందుగా లోతు దుక్కులు దున్నుకొని, పొలంలో ఇతర పంటల అవశేషాలను పూర్తిగా తొలగించి కాల్చి నాశనం చేయాలి.

పొలం గట్లపై కూడా కలుపు మొక్కలను పూర్తిగా తీసేయాలి.అధికంగా సేంద్రియ ఎరువులకు( Organic Fertilizers ) ప్రాధాన్యత ఇవ్వాలి.

ఆఖరి దుక్కిలో ఒక ఎకరం పొలానికి 10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియ దున్నుకోవాలి.

మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య సూర్యరశ్మి మరియు గాలి బాగా తగిలే విధంగా దూరంగా నాటుకుంటే దాదాపుగా చీడపీడల, తెగుళ్ల బెడద తగ్గినట్టే.

"""/" / ఈ మల్లె తోటలను ఆశించి తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లలో ఆ కుమారుడు తెగుళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ తెగుళ్లను సకాలంలో గుర్తించి వెంటనే నివారించాలి.ఆగస్టు నుంచి నవంబర్ వరకు, వర్షాలు పడే సమయాలలో ఈ తెగుళ్లు పంటను ఆశించే అవకాశం ఉంది.

ఆకుల చివరి భాగం ముడుచుకుపోయి, ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడితే ఈ ఆకుమాడు తెగుళ్లు పంటను ఆశించినట్టే.

తొలి దశలోనే ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ ను కలిపి పిచికారి చేయాలి.

తరువాత పది రోజులకు ఒక లీటర్ నీటిలో ఒక గ్రాము కార్బండిజంను కలిపి పిచికారి చేయాలి.

మల్లె పూల మొక్క కింది భాగం ఆకులు ఎండిపోయి రాలిపోవడం జరిగితే ఆ మొక్కకు ఎండు తెగుళ్లు సోకినట్టే.

తొలి దశలో అరికట్టకపోతే మొక్క ఎండిపోయి చనిపోయే అవకాశం ఉంది.ఒక లీటరు నీటిలో ఒక గ్రాము బావిస్టిన్ ను కలిపి ఆ ద్రావణంతో మొక్క చుట్టూ ఉండే నేలను తడపాలి.

తోటల్లో నీటి ఎద్దడి సమస్యలు దరిచేరకుండా తగిన మోతాదులో నీటి తడులు అందిస్తూనే ఉండాలి.