Kandi Crop : కంది పంటకు తీవ్ర నష్టం కలిగించే ఎండు తెగుళ్లను నివారించే పద్ధతులు..!

కంది పంటను వర్షాధార పంటగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు.నీటి పారుదల సౌకర్యం ఉంటే మంచి దిగుబడులు పొందవచ్చు.

కంది పంటకు దాదాపుగా అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి.బీడు భూములలో కూడా కంది పంట సాగు చేసి మంచి దిగుబడులు పొందవచ్చు.

కంది పంటను సాగు చేయాలి అనుకునే రైతులు సాగు విధానంపై అవగాహన కల్పించుకుంటే పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు శ్రమ కూడా తగ్గించి మంచి దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు( Agricultural Experts ) చెబుతున్నారు.

వేసవిలో లోతు దుక్కులు దున్నుకొని ఒక ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువు, 10 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం( Phosphorus ) ఎరువులు వేసి కలియ దున్నుకోవాలి.

ఆ తరువాత విత్తనానికి ముందు నేలను వదులు అయ్యేలా రెండు లేదా మూడుసార్లు దమ్ము చేసుకోవాలి.

"""/" / ఒక ఎకరాకు రెండు కిలోల కంది విత్తనాలు అవసరం.ఒక కిలో కంది విత్తనాలకు మూడు గ్రాముల థైరంతో( Thyrum ) విత్తన శుద్ధి చేసుకోవాలి.

మొక్కల మధ్య 25 సెంటీమీటర్లు, సాలుల మధ్య 120 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు విత్తుకోవాలి.

కంది పంట వర్షాధార పంట.కాబట్టి నీటి అవసరం కాస్త తక్కువ.

పంట పూత, పిందె దశలో ఉన్నప్పుడు నీటిని అందిస్తే సరిపోతుంది.బీడు భూములలో( Waste Lands ) అయితే విత్తిన పది రోజుల తర్వాత నీటి తడిని అందించి, ప్రతి 15 రోజులకు ఒకసారి నీటి తడి అందిస్తే సరిపోతుంది.

"""/" / కంది పంటకు చీడపీడల, తెగుళ్ల బెడద ( Pests )కాస్త ఎక్కువ.

పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ ఏవైనా చీడపీడలు లేదంటే తెగుళ్లు పంటను ఆశిస్తే తొలి దశలోనే అరికట్టే ప్రయత్నం చేయాలి.

కంది పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే ఎండు తెగుళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.

ఎదుగుతున్న కంది మొక్కలు ఎండిపోతే.ఆ మొక్కకు ఎండు తెగుళ్లు సోకినట్టే.

పంట పొలంలో ఎండు మొక్కలు కనిపిస్తే వెంటనే వాటిని పంట చేను నుండి తొలగించాలి.

రసాయన పిచికారి మందులు ఉపయోగించి ఈ ఎండు తెగుళ్లు వేరే మొక్కలకు వ్యాప్తి చెందకుండా పూర్తిగా అరికట్టవచ్చు.

ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల మాంకోజెబ్ ను కలిపి పిచికారి చేయాలి.

ఫ్యూయల్ ట్యాంక్ పగిలి ఎగసిపడ్డ మంటలు.. వేగంగా స్పందించిన పెట్రోల్ బంక్ ఉద్యోగి..