జొన్న పంటకు తీవ్ర నష్టం కలిగించే పేనుబంకను అరికట్టే పద్ధతులు..!

జొన్న పంట( Sorghum Crop ) లో తీవ్ర నష్టం కలిగి సగానికి పైగా తగ్గింది అంటే దానికి ప్రధాన కారణం పేనుబంక పురుగులు.

ఈ పురుగులు చాలా చిన్నగా ఉండి మృదువైన శరీరంలో కలిగి ఉంటాయి.ఈ పురుగులలో చాలా జాతులు ఉన్నాయి.

వాటి జాతిని బట్టి అవి పసుపు, గోధుమ, ఎరుపు, నలుపు రంగులలో ఉంటాయి.

ఇందులో కొన్ని పురుగులకు రెక్కలు ఉంటాయి మరికొన్ని పురుగులకు రెక్కలు అనేవి ఉండవు.

లేత జొన్న మొక్క ఆకుల కింది భాగంలో ఈ పురుగులు జీవిస్తాయి.ఇవి ఆకుల యొక్క కణజాలాన్ని పూర్తిగా తినేస్తాయి.

ఈ పురుగులు( Worms ) తేనె బంకను ఉత్పత్తి చేస్తాయి.ఈ బంకతో ఫంగస్ ద్వారా రకరకాల తెగులు అంటను ఆశించే అవకాశం ఉంది.

మొక్క ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది.అందువలన పేనుబంక పురుగులను( Aphids ) తొలి దశలోనే అరికట్టేందుకు సంరక్షక చర్యలు పాటించాలి.

జొన్న పంట సాగు చేయడానికి ముందే ఇతర పంటకు చెందిన అవశేషాలను పొలం నుండి పూర్తిగా తొలగించాలి.

పొలం చుట్టూ అధిక సంఖ్యలో వివిధ రకాల మొక్కలను పెంచాలి.తెగులు సోకిన మొక్కలను వెంటనే పంట నుండి వేరు చేయాలి.

ఎప్పటికప్పుడు కలుపును తొలగించాలి.ఎరువులు, మీరు అధికంగా వాడకూడదు.

"""/" / జొన్న పంటలో పెనుబంక ను గుర్తించి సేంద్రీయ పద్ధతిలో నివారించే చర్యలు చేపట్టాలి.

తేమ అధికంగా ఉన్నప్పుడు ఈ పేనుబంక సోకే అవకాశం ఉంటుంది.కాబట్టి తేమ అధికంగా ఉండే సమయంలో ఒక లీటరు నీటిలో మూడు మిల్లీలీటర్ల వేప నూనెను కలిపి తెగులు సోకిన మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేస్తే, రెండు మూడు రోజులలో తెగులు అరికట్టబడతాయి.

"""/" / ఒకవేళ ఈ పేనుబంక వ్యాప్తి అధికంగా ఉంటే రసాయన పద్ధతిలో రెండు మిల్లీలీటర్ల ఫిప్రోనిల్( Fipronil ) లేదా థియామెథోక్సమ్( Thiamethoxam ) 0.

2 గ్రాములు కలిపి పంటకు పిచికారి చేయాలి.లేదంటే 0.

2 గ్రాములు ఎసిటామిప్రిడ్ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసి ఈ పేనుబంకను నివారిస్తేనే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.

వేరే దర్శకుడి సినిమాకు సంగీత దర్శకత్వం చేసిన సినిమా దర్శకుడు ఎవరో తెలుసా ?