Marigold : బంతి పంటకు తీవ్ర నష్టం కలిగించే పేనుబంక, మొగ్గ తొలుచు పురుగులను అరికట్టే పద్ధతులు..!

బంతి పంటను ( Marigold ) వాతావరణ పరిస్థితులను బట్టి సంవత్సరం పొడుగునా ఏ కాలంలో అయినా సాగు చేయవచ్చు.

అయితే 18 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే వాతావరణంలో బంతి సాగులో అధిక దిగుబడులు పొందవచ్చు.

అధిక ఉష్ణోగ్రతలు( High Temperatures ) ఉంటే బంతిపూల పరిమాణం చిన్నగా ఉంటుంది.

అలా అని నీడ ఉండే ప్రదేశాల్లో బంతి పంటను సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించలేం.

బంతిపూలలో చాలా రకాలు ఉన్నాయి అయితే ఫ్రెంచ్, ఆఫ్రికన్ బంతిపూలకు వాణిజ్యపరంగా అధిక డిమాండ్ ఉంది.

కాబట్టి రైతులు ఈ రకాలను సాగు చేస్తే ఆశించిన స్థాయిలో లాభాలు పొందవచ్చు.

"""/" / ఫ్రెంచ్ బంతిని సాగు చేస్తే.ఈ రకానికి చెందిన మొక్కలు పొట్టిగా ఉంటాయి.

కేవలం 30 నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే పెరుగుతాయి.అయితే ఈ రకానికి చెందిన మొక్కలు చాలా దృఢంగా ఉంది సింగిల్ లేదా డబుల్, పువ్వులను కలిగి ఉంటాయి.

ఆఫ్రికన్ బంతిని సాగు చేస్తే.ఈ రకానికి చెందిన చెందిన 90 నుంచి 120 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతాయి.

ఆఫ్రికన్ బంతిలో వివిధ రంగులు కలిగిన పూల రకాలు ఉన్నాయి.ఆర్కా అగ్ని, ఆర్కా బంగార, పూసా బసంతి గైందా,పూసా నారింగ గైందా రకాలు మంచి దిగుబడులు ఇస్తాయి.

"""/" / బంతిపూలకు చీడపీడల, తెగుళ్ల బెడద కాస్త ఎక్కువ.సకాలంలో వీటిని గుర్తించి తొలి దశలోనే ఆరికట్టాలి.

ముఖ్యంగా బంతిపూల పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే పేనుబంక మరియు మొగ్గ తోలుచు పురుగులు కీలక పాత్ర పోషిస్తాయి.

పేనుబంక పిల్ల మరియు పెద్ద పురుగులు ఎదుగుతున్న పూ మొగ్గలను, ఆకులను ఆశించి రసాన్ని పూర్తిగా పీల్చేస్తాయి.

దీంతో బంతిపూల నాణ్యత తగ్గుతుంది.ఈ పురుగులను పంట పొలంలో గుర్తించిన తర్వాత 1.

5గ్రా ఎసిఫేట్( Acephate ) ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ఆ తరువాత ఒక వారం రోజులకు రెండు మిల్లీలీటర్ల డైమిథోయేట్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

15 రోజులకు మదిలో ఈ మందులు మారుస్తూ పిచికారి చేస్తే పేనుబంక పురుగులు పూర్తిగా అరికట్టబడతాయి.

మొగ్గ తోలుచు పురుగులు బంతి పంటను ఆశిస్తే.బంతిపూల భాగాన్ని తోలుచుకుంటూ తినడం వల్ల పూ మొగ్గలు సరిగ్గా విచ్చుకోవు.

వీటి నివారణ కోసం రెండు మిల్లీలీటర్ల ప్రోఫెనోఫాస్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ప్రేక్షకులను గొర్రెలనుకున్నారా.. ఆ సినిమా తీయడమే ఎన్టీఆర్ చేసిన పెద్ద బ్లండర్?