పొగాకు లద్దె పురుగుల నుండి వేరుశనగ పంటను సంరక్షించే పద్ధతులు..!

వేరుశనగ పంట( Groundnut Crop ) నూనె గింజల పంటలలో ప్రధానమైనది.అయితే వేరుశనగ పంట పూత, పిందే దశలో ఉన్నప్పుడు చీడపీడల బెడద చాలా ఎక్కువ.

సకాలంలో ఈ చీడపీడలను అరికడితే అధిక లాభం పొందవచ్చు.రైతులు సరైన అవగాహన లేక వేరుశనగ పంటలో అధిక దిగుబడి సాధించలేకపోతున్నారు.

కాబట్టి ఈ పంటపై అవగాహన కల్పించుకుని సస్య రక్షక పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.

వేరుశనగ పంటకు ఆశించి తీవ్ర నష్టం కలిగించే చీడపీడలలో లద్దె పురుగులు కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ పురుగులు లేత ఆకులపై గుడ్లు పెట్టి, ఇందులో నుంచి బయటికి వచ్చిన పిల్లలు గుంపులు గుంపులుగా ఆకుల పత్ర హరితాన్ని తినేస్తాయి.

ఈ పురుగులు సాయంత్రం, రాత్రి వేళల్లో మాత్రమే ఆకులను ఆశించి తినేస్తాయి. """/" / అయితే ఈ లద్దె పురుగులు పంటను ఆశించకుండా ఉండాలంటే ముందుగా వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవాలి.

ఈ పురుగులకు సంబంధించిన గుడ్లు, అవశేషాలు ఏవైనా ఉంటే సూర్యరశ్మికి నాశనం అవుతాయి.

పంట పొలం చుట్టూ గెట్ల వెంబడి ఆముదము, ప్రొద్దుతిరుగుడు ( Sunflower Cultivation )మొక్కలను వేసుకుంటే ఈ లద్దె పురుగుల వ్యాప్తి చాలావరకు తగ్గే అవకాశం ఉంటుంది.

""img / ఇక ఈ పురుగుల ఉనికిని పొలంలో గుర్తించిన తర్వాత ముందుగా సేంద్రీయ పద్ధతిలో ఐదు శాతం వేపగింజల కషాయమును సాయంత్రం వేళలో పంటపై పిచికారి చేయాలి.

లద్దె పురుగులు పిల్లదశలో ఉన్నప్పుడు 400 మిల్లీలీటర్ల క్వినాల్ పాస్ ను 200మి.

లీ నీటిలో కలిపి ఎకరం పంటకు పిచికారి చేయాలి.ఒకవేళ లద్దె పురుగులు ఎదిగి పెద్దదశలో ఉన్నప్పుడు నోవాల్వురాన్( Novaluron ) 200 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

లేదంటే క్లోరాంత్రనిలిప్రోల్ 60 మిల్లీలీటర్లలో 200 లీటర్ల నీళ్లు కలిపి పంటకు పిచికారి చేసి ఈ పురుగుల అను పూర్తిగా అరికట్టాలి.

బట్టలు మార్చుకోవడానికి అలాంటి ఇబ్బందులు పడ్డా..విద్యాబాలన్ కామెంట్స్ వైరల్!