గజ్జి తెగుల నుండి నిమ్మ తోటలను సంరక్షించే పద్ధతులు..!

నిమ్మ తోటల( Lemon Groves ) సాగులో తీవ్రంగా నష్టం కలిగించే తెగుళ్లలో గజ్జి తెగులను( Scabies Pest ) ప్రధానంగా చెప్పుకోవచ్చు.

గజ్జి తెగులు సోకడానికి యాజమాన్య లోపం లేదా సమస్యాత్మక నేలలలో సాగు చేయడం కారణం అవుతాయి.

గజ్జి తెగులు సోకితే చెట్లు క్షీణించడంతోపాటు, కాయ నాణ్యతను కోల్పోతుంది.కాబట్టి గజ్జి తెగులను నివారించడంలో సమగ్ర చర్యలు పాటించాలి.

గజ్జి తెగులు సోకితే మొక్క వేర్లు పూర్తిగా కుళ్ళిపోయి మొత్తం చెట్టు చనిపోయే అవకాశాలు ఉన్నాయి.

కొంత రైతులు ఈ గజ్జి తెగుల నివారణపై అవగాహన లేక తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు.

నిమ్మ తోటలు సాగు చేసిన మూడు సంవత్సరముల నుంచి 30 సంవత్సరాల వరకు నిరంతరంగా దిగుబడి వస్తూనే ఉంటుంది.

కాబట్టి ఏడాది పొడుగునా నిమ్మ తోటల వల్ల ఆదాయం అర్జించవచ్చు.కానీ నవంబర్ నెలలో వచ్చిన పూతకు వేసవిలో కాయలు తయారవుతాయి.

వేసవిలో నిమ్మకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది.కాబట్టి నవంబర్ నెల నుంచి పంటను జాగ్రత్తగా సంరక్షించుకోవాలి.

"""/" / గజ్జి తెగులు నిమ్మచెట్టు ఆకులపై, కాయలపై ప్రభావాన్ని చూపుతాయి.మొదట ఆకు పసుపు పచ్చ రంగులోకి మారి, ఆకుపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి.

ఈ మచ్చలు క్రమంగా ఉబ్బుతూ, గజ్జి వలే కనిపిస్తాయి.తరువాత ఈ ఆకులు రాలిపోతాయి.

ఇక కాయలపై కూడా ఇలాగే గజ్జి లాగా కనిపించి జిగురు ద్రవం కారడం స్పష్టంగా కనిపిస్తుంది.

దీంతో కాయలు ముదరక ముందే రాలిపోతాయి.ఆ తర్వాత క్రమంగా లేత కొమ్మలపై, కాండంపై సోకి చివరికి చెట్టు ఎండిపోయి క్షీణిస్తుంది.

గజ్జి తెగుల నివారణలో మొదట తెగులు సోకిన మొక్క కొమ్మలను కత్తిరించి పారేయాలి.

తరువాత 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల బ్లైటాక్స్, 1గ్రాము స్ట్రెస్టోసైక్లిన్( Strestocycline ) కలిపి 20 రోజుల వ్యవధిలో రెండు లేదా మూడుసార్లు చెట్టు మొత్తం తడిచేలాగా పిచికారి చేయాలి.

చెట్టు మొదళ్ల వద్ద, కాండం వద్ద ఈ తెగులు కనిపిస్తే కత్తితో గోకి బోర్డో పేస్ట్ పూయాలి.

నవంబర్ లో వచ్చే పూతను కాపాడుకోవడం కోసం మే, జూన్ నెలలలో ఎండుకొబ్బలను కత్తిరించడం, చెట్లకు గాలి వెలుతురు ధారణంగా వచ్చేటట్లు చూసుకోవడం చాలా అవసరం.

ఈ పద్ధతులు పాటించి నిమ్మ తోటలను సంరక్షించు కోవాలి.

కాటేసిన పామును ప్లాస్టిక్ బ్యాగ్ లో తీసుకొచ్చి ఆస్పత్రిలో గందరగోళాన్ని సృష్టించిన యువకుడు..