జొన్న పంట సాగులో బంకకారు తెగులను అరికట్టే పద్ధతులు..!

చిరుధాన్యాల పంటల సాగులో జొన్న పంట( Sorghum ) ప్రధానమైనది.జొన్నలను ఆహారంగా, జొన్న చొప్పను పశుగ్రాసంగా ఉపయోగిస్తారు.

పాడి పశువులు ఉండే రైతులు కచ్చితంగా ప్రతి సంవత్సరం జొన్న పంటను సాగు చేస్తారు.

పైగా మార్కెట్లో జొన్నకు మంచి డిమాండ్ ఉంది.అయితే కొన్ని సస్యరక్షక పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి పొందవచ్చు.

వేసవికాలంలో పొలాన్ని బాగా లోతు దుక్కులు దున్నాలి.ఆఖరి దుక్కులో పశువుల ఎరువు వేసి కలియదున్నాలి.

ఆ తరువాత పంట పొలంలో ఉండే అవశేషాలను పూర్తిగా పంట నుండి వేరు చేసి కాల్చి నాశనం చేయాలి.

ఇక కేవలం పశుగ్రాసం కోసమే సాగు చేయాలనుకుంటే విత్తనాలను దగ్గర దగ్గరగా విత్తుకోవాలి.

ఆ కాకుండా జొన్నల దిగుబడి అధికంగా ఉండాలంటే మొక్కల మధ్య కాస్త దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.

విత్తనాలను ముందుగా ఇమిడా క్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. """/" / జొన్న పంట సాగు( Jowar Cultivation ) చేయడానికి నల్ల రేగడి నేలలు, బంకమట్టి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.

నీటిని ఎంత ఎక్కువ అందిస్తే అంత మంచి దిగుబడి పొందవచ్చు.పొలంలో ఎప్పటికప్పుడు కలుపును( Weeds ) నివారించాలి.

ఇక జొన్న పంటకు చీడపీడల బెడద, తెగుళ్ల బెడద( Pests ) కాస్త ఎక్కువే.

కాకపోతే జొన్న పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లలో బంకకారు తెగులు( Glutinous Rot ) కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ తెగులను సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితేనే మంచిది సాధించడానికి అవకాశం ఉంటుంది.

"""/" / జొన్న మొక్కలు పుష్పించే దశలో వాతావరణం లో మార్పులు జరిగితే, అంటే తేమ శాతం పెరగడం, వాతావరణం మేఘావృతం అయినప్పుడు ఈ తెగులు వ్యాప్తి చెందుతాయి.

ఈ తెగులు సోకిన జొన్నకంకి నుండి తెలుపు రంగులో లేదా గులాబీ రంగులో జిగురు వంటి ద్రవం బయటకు రావడం గమనించవచ్చు.

ఆ జిగురుపై శిలీంద్రాలు జీవించడం వల్ల జొన్న కంకులు నల్లగా కనిపిస్తాయి.వీటిని సకాలంలో అరికట్టాలంటే జొన్న పంట పూత దశలో ఉన్నప్పుడు ఒక లీటర్ నీటిలో రెండు గ్రాముల మాంకోజెబ్ కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పంటపై చల్లాలి.

లేదంటే లీటర్ నీటిలో 1గ్రా.బెన్ లేట్ కలిపి పూత దశలో ఉన్నప్పుడు రెండుసార్లు వారం వ్యవధిలో చల్లితే తెగులు అరికట్టబడతాయి.

తిరుమలకు పవన్ కళ్యాణ్… ఆ సభపై అందరిలోనూ టెన్షన్