Groundnut Crop : వేరుశనగ పంట విత్తుకునే పద్ధతి.. విత్తన శుద్ధిలో మెళుకువలు..!

ప్రధాన నూనె గింజల పంటలలో వేరుశనగ పంట కూడా ఒకటి.వేరుశనగ పంట విత్తుకునే విధానం, సాగు విధానంపై అవగాహన ఉంటే మంచి దిగుబడులు పొందవచ్చు.

వేరుశనగ పంట సాగుకు ఇసుక నేలలు, ఒండ్రు నేలలు, నీరు నిల్వ ఉండని నల్ల రేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి.

నేల యొక్క పీహెచ్ విలువ 6.0-6.

5 ఉంటే మంచి దిగుబడులు( Yields ) పొందవచ్చు.వేరుశనగ వేసే నేలను వేసవికాలంలో లోతు దుక్కులు దున్నుకోవాలి.

అయితే ఎక్కువగా లోతు దున్నితే పంట కోయడం కాస్త కష్టం అవుతుంది.అంతేకాదు మొక్క ఎక్కువ ఎత్తు పెరుగుతుంది.

దీంతో కాయలు భూమి లోతులో కాస్తాయి.కాబట్టి నేలను 10 నుంచి 16 సెంటీమీటర్ల లోతు వరకు మాత్రమే దున్నుకోవాలి.

"""/" / వేరుశనగ పంటలో అత్యంత కీలకము విత్తన శుద్ధి.సాగుకు మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.

దెబ్బతిన్న గింజలు, రంగు మారిన గింజలు పూర్తిగా తొలగించి నాణ్యమైన గింజలను సాగుకు ఎంపిక చేయాలి.

నేల నుంచి పంటకు ఎలాంటి తెగులు సోకకుండా ఉండాలంటే ఒక కిలో విత్తనాలకు మూడు గ్రాముల థైరం లేదంటే మూడు గ్రాముల మాంకోజెబ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి.

వేరుశనగ విత్తనం విత్తుకున్నా తరువాత ఎలుకలు, ఉడతలు, పక్షులు చెలక నుండి వేరు చేస్తాయి.

కాబట్టి ఎండకి మెరిసే కవర్లను పొలంలో అక్కడక్కడ ఉంచాలి. """/" / జూన్ మొదటి వారంలో వేరుశనగ విత్తనం విత్తుకోవాలి.

విత్తే సమయంలో భూమిలో తేమశాతం ఉండేలా చూసుకోవాలి.జూన్ లో మొదటి వర్షాలు మొదలు కావడం వలన అన్ని విత్తనాలు మొలకెత్తడం జరుగుతుంది.

విత్తనం విత్తుకునేటప్పుడు నాగలితో విత్తనం లోతు ఐదు సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతు పడకుండా చూసుకోవాలి.

సాలుల మధ్య కనీసం 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చూసుకోవాలి.వేరుశనగ పంట( Groundnut Crop )ను వర్షాకాలం మొదలు కాకముందే వేస్తే, మొదటిసారి ఒకటి లేదా రెండు సార్లు నీటిపారుదల అవసరం అయ్యే అవకాశం ఉంది.

పంట పూత దశలో ఉన్నప్పుడు ఎనిమిది రోజులకు ఒకసారి నీటి తడి అందించాలి.

ఏవైనా చీడపీడలు( Pests ) లేదా తెగుళ్లు పంటను ఆశిస్తే సకాలంలో గుర్తించి తొలి దశలోని అరికట్టాలి.

ప్రభాస్ స్పిరిట్ మూవీలో ఆ పాత్రలో మెగాస్టార్ నటిస్తున్నారట.. కానీ?