అల్లం సాగులో మడుల తయారీ విధానం.. సాగులో మెళుకువలు..!
TeluguStop.com
అల్లం పంటకు( Ginger Crop ) వాణిజ్య పంటగా మంచి ధర ఉండడంతో రైతులు అల్లం సాగుపై అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు.
అల్లం సాగులో అధిక దిగుబడి సాధించి, మంచి లాభాలు పొందాలంటే అల్లం సాగు చేసే మడుల తయారీ విధానం, సాగులో కొన్ని మెళుకువలు పాటించాలి.
అల్లం పంట సాగుకు సారవంతమైన తేలికపాటి నల్ల భూములు చాలా అనుకూలంగా ఉంటాయి.
అల్లం పంటను ఏప్రిల్ రెండవ వారం నుంచి మే నెల మూడవ వరం వరకు విత్తుకోవచ్చు.
అల్లం పంట విత్తడం ఆలస్యం అయితే పంటకు దుంప కుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది.
"""/" /
ఒక ఎకరాకు 600 కేజీల విత్తన దుంపలు అవసరం.
తెగులు సోకని దుంపలను ఎంపిక చేసుకోవాలి.ఒక్కొక్క విత్తన దుంప సుమారుగా 25 నుంచి 30 గ్రాముల బరువు ఉండేలా ముక్కలుగా విత్తుకోవాలి.
విత్తన శుద్ధి చేసి విత్తుకుంటే వివిధ రకాల చీడపీడలు లేదా తెగులు పంటను ఆశించలేవు.
ఒక లీటర్ నీటిలో మూడు గ్రాముల రెడోమిల్ ఎంజెడ్( Redomil MZ ) మరియు ఐదు మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్( Chlorpyrifos ) ద్రావణాన్ని కలిపి ఈ ద్రావణంలో 40 నుంచి 80 నిమిషాల పాటు విత్తన దుంపలను నానబెట్టాలి.
"""/" /
అల్లం సాగుకు మడుల తయారీ విధానం: ముందు భూమిని బాగా దున్ని మెత్తగా చేసుకోవాలి.
ఆ తరువాత ఎత్తైన సమతల మడులు ఏర్పాటు చేసుకోవాలి.మడుల మధ్య ఉండే కాలువలు 20 సెంటీమీటర్లు లోతు ఉండేటట్లు చేసుకోవాలి.
లేదంటే బోదెలు, కాలువలు 40 సెంటీమీటర్ల ఎడంలో ఏర్పాటు చేసి బోదెలపై అల్లం నాటాలి.
విత్తన దుంపలను నాటేటప్పుడు మొలకెత్తిన భాగాలు పైకి ఉండేటట్లుగా నాటాలి.మొలకెత్తిన మొలకలు విరిగిపోకుండా విత్తన కొమ్ములను విత్తడానికి 10 రోజుల ముందు నుంచి నీటిలో 24 గంటలు నానబెట్టడం వల్ల మంచి మొలక శాతం వస్తుంది.
మడులు 10 సెంటీమీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల వెడల్పు ఉండేటట్లు ఎత్తు బెడ్ లను తయారు చేసి ఒక్కొక్క బెడ్ మీద నాలుగు వరుసలలో దుంపలు నాటి బిందు సేద్యం ద్వారా సాగు చేయాలి.
లాస్ ఏంజెల్స్ అగ్నిప్రమాదం .. బాధితులకు సిక్కు కమ్యూనిటీ ఆపన్నహస్తం