బెంగళూరులో ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..!!
TeluguStop.com
రానున్న 48 గంటల పాటు బెంగళూరు నగరం( Bangalore )లో కుండపోత వర్షాలు కురుస్తాయ ని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.నగరంలో వర్షం ఎక్కువగా పడుతున్నందువల్ల లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
ఇదే సమయంలో వర్షం కుండపోతుగా కురుస్తుంది.బెంగళూరు నగరంలో సాధారణంగా మేఘావృతమై ఉంటుంది సాయంత్రం తర్వాత విస్తారంగా వర్షం కురిసే అవకాశం ఉందని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పలుచోట్ల ఓ మోస్తారు వర్షం నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేయడం జరిగింది.
గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీల నుంచి 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ( Weather Report ) అధికారులు స్పష్టం చేశారు.
గత రెండు రోజులుగా బెంగళూరులో విపరీతమైన వర్షాలు పడటం జరిగాయి.ఆదివారం సాయంత్రం నుంచి వరుసగా వర్షాలు( Heavy Rains ) కురుస్తూనే ఉన్నాయి.
గంటల తరబడి కురుస్తున్న వర్షాలకు.బెంగళూరులో చెట్లు నేలకూలి రోడ్డు మీద పడటంతో.
రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డాయి.ఇదే సమయంలో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు.
అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బెంగళూరు నగరంతో పాటు సమీప గ్రామీణ జిల్లాలలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ప్రధానంగా బెంగళూరు, చిక్కమగలూరు, హాసన్, కొడగు, శివ మొగ్గ జిల్లాలతో పాటు తీర ప్రాంతాలైన ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ఎల్లో అలర్ట్ తాజాగా ప్రకటించారు.
చెక్‌బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష