ఎన్టీఆర్ తో భేటీ.. ఆర్ఆర్ఆర్ లెక్క పూర్తిచేసిన మోడీషాలు..!!

మోడీషాల ద్వ‌యం.ఏది చేసినా ప‌క్కా వ్యూహం ఉంటుందంటారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఇద్ద‌రి ఆలోచ‌నా విధానం ఒకే విధంగా ఉంటూ విడ‌దీసి చూడ‌లేనంత‌గా ఉంటుంది.మోడీ ఆలోచ‌న‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు అమిత్ చేత‌ల‌తో పూర్తి చేస్తార‌ని తెలిసిందే.

ఇక అమిత్ షా రంగంలోకి దిగితే ఆయ‌నను మించినోళ్లు లేర‌నే చెప్పాలి.ఇక రీసెంట్ గా తెలంగాణకు వచ్చిన అమిత్ షా తన టూర్ మొత్తం అనుకోని భేటీలతో హైలైట్ అయ్యారు.

తెలంగాణ‌లో స‌డెన్ గా అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకోవ‌డంతో హాట్ టాపిక్ గా మారారు.

అన్నింటికి మించి ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్ తో భేటీ కావ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది.

అయితే ఈ భేటిపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.కానీ.

ఎవరెన్ని వాదనలు.సిద్ధాంతాల్ని తెర మీదకు తీసుకొచ్చినా.

ప్రతి దాన్లోనూ ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంది తప్పించి.ఇద్దరిమధ్య భేటీ అస‌లు విష‌యం మాత్రం పక్కా వాదన వినిపించినోళ్లే లేరు.

H3 Class=subheader-styleఆ ముగ్గురికి ప్ర‌శంస‌ల రూప‌లో./h3p అయితే ఎన్టీఆర్ ని పిలిపించుకుని మరీ భేటీ అయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆర్ఆర్ఆర్ మూవీకి అభినందనలు తెలియజేసేందుకు ఎన్టీఆర్ ను పిలిపించినట్లుగా చెబుతున్నప్పటికి.చాలామంది ఆ వాదనను అంగీకరించ‌క‌పోవ‌డం తెలిసిందే.

అయితే నిజంగానే ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతంగా నటించిన ఎన్టీఆర్ ను అభినందించటమే లక్ష్యమైతే.

ఈ సినిమాలో అద్భుతంగా నటించిన రాంచరణ్ ను ఎందుకు ఆహ్వానించలేదు.? అన్నది మ‌రికొంద‌రి ప్ర‌శ్న‌.

"""/"/ అయితే ఆర్ఆర్ఆర్ కి సంబంధించి ఇప్పటికే రాంచరణ్ ను అభినందించటం తెలిసిందే.

మరో ఆర్ అయిన రాజమౌళి విషయానికి వస్తే.ఆయన తండ్రికి రాజ్యసభ సీటును కేటాయించటం ద్వారా లెక్కలు సెట్ చేశారని చెప్పాలి.

ఇక మిగిలింది ఎన్టీఆరే కాబ‌ట్టి పిలిపించి ప్ర‌శంసించార‌ని.దీంతో ఆర్ఆర్ఆర్ లెక్క స‌రిచేశార‌ని అంటున్నారు.

అయితే మొత్తానికి ఈ కారణంతోనే ఎన్టీఆర్ ని కలవ‌డం ద్వారా.అటు సినిమాకు సంబంధించిన బ్యాలెన్స్ ను పూర్తిచేయటంతో పాటు.

తమకు అవసరమైన పొలిటికల్ బజ్ ను క్రియేట్ చేయటంలో సక్సెస్ అవుతామన్న ఆలోచనతోనే భేటీ ఏర్పాటు చేసినట్లుగా విశ్లేష‌కులు అంటున్నారు.

మారేకార‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ ఈ భేటీ మాత్రం సంచ‌ల‌నం అనే చెప్పాలి.

స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న కొరటాల శివ