స్కూల్ పిల్లల జీవితాలతో చెలగాటం.. డ్రైవర్ షాకింగ్ వీడియో

పిల్లలను స్కూల్ కి పంపించే విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.వాహనాల్లో స్కూల్( School Bus ) కి పంపించేటప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంటారు.

వ్యాన్, ఆటో, బస్సు, ఇతర వాహనాల్లో స్కూల్ కి పిల్లలను పంపుతూ ఉంటారు.

భద్రతగా ఉంటుందనే నమ్మకంతో వాటిల్లో తమ పిల్లలను స్కూల్ కి పంపిస్తారు.మరికొంతమంది తల్లిదండ్రులు అయితే స్వయంగా స్కూల్ దగ్గర వదిలిపెట్టి, ఆ తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్లి పికప్ చేసుకుంటారు.

"""/" / అయితే ఇతరుల వాహనాల్లో పిల్లలను స్కూల్ కి పంపించే సమయంలో తల్లిదండ్రులు కాస్త ఆందోళనకు గురవుతూ ఉంటారు.

తాజాగా సోషల్ మీడియ( Social Media )లో వైరల్ అవుతున్న ఒక వీడియో తల్లిదండ్రులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది.

ఇందులో ఒక ట్రాలీ లాంటి నాలుగు చక్రాల వాహనంలో గొర్రెలు, మేక వలే ఇరుక్కుని విద్యార్థులు కూర్చున్నారు.

అలాగే కొంతమంది విద్యార్థులు వెహికల్ పైకప్పు, బానెట్ పై కూర్చున్నారు.గుజరాత్‌లోని దాహెద్ లో ఈ దృశ్యం కనిపించింది.

ఈ వీడియోలో కనిపిస్తున్న వాహనం పశువులను తరలించేది అని తెలుస్తుంది. """/" / పశువులను తరలించే ఆ వాహనంలో 24 మంది విద్యార్థులు ఇరుక్కుగా కూర్చోని ప్రయాణిస్తున్నారు.

కొంతమంది వెనుక వేలాడుతూ, మరికొంతమంది పైకప్పుపై కూర్చోని కనిపించారు.మరికొంతమందిని బానెట్ పై డ్రైవర్ కూర్చొబెట్టాడు.

ఈ విద్యార్థుల వయస్సు 13 లేదా 14 సంవత్సరాలు ఉంటుందని తెలుస్తోంది.గుజరాత్ కి చెందిన కాంగ్రెస్ నేత అమిత్ చావ్డా ఈ వీడియోను తన ట్విట్టర్( Twitter ) లో షేర్ చేశారు.

దీంతో ఈ వీడియోపై రాజకీయాలు కూడా మొదలయ్యాయి.అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దానికి ఇది దారితీస్తోంది.

అయితే ఈ వీడియో మాత్రం పిల్లలను స్కూల్ కి పంపించే తల్లిదండ్రులను భయపెడుతోంది.

పిల్లలను వేరే వాహనాల్లో స్కూల్ కి పంపించాలంటేనే భయమేస్తుందని అంటున్నారు.

మైదా పిండిని ఎలా తయారు చేస్తారు.. ఆరోగ్యానికి అది ఎందుకు మంచిది కాదు?