గేదె తోక పట్టుకుని నది దాటాలనుకున్నాడు.చివరికి..

కుక్కతోక పట్టుకుని గోదారి ఈదడం అనే సామెత ఎప్పుడన్నా విన్నారా.అసలది సాధ్యమేనా.

అది సాధ్యమో కాదో తెలుసుకోవాలనుకున్నాడో ఏమో.కుక్క కాదు ఏకంగా గేదు తోక పట్టుకుని నది దాటాలనుకున్నాడు.

ప్రాణాలు కోల్పోయాడు.మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్న సంఘటన వివరాలు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ మధ్యప్రదేశ్‌లోని గోహద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గండ్‌రౌలీ గ్రామనివాసి లాలారామ్ శర్మ.

వయసు అరవైఐదు సంవత్సరాలు.తమ గేదెను తీసుకుని మేత మేపడానికి బయటికి వెళ్లాడు.

బయటికి వెళ్లిన లాలారామ్ గేదెని పట్టుకుని నదిని దాటడానికి ప్రయత్నించాడు.నది మధ్యలో ఏదో మేత కనిపించడంతో అది అక్కడ ఆగిపోయింది.

ఇంతలో ఒక బలమైన అల రావటంతో లాలారామ్ శర్మ నీటిలో మునిగిపోయాడు.వెళ్లిన వాడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు.

ఎక్కడా లాలారామ్ ఆచూకి దొరకలేదు.లాలారామ్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు అదృశ్యమైన ఆ వృద్ధుని కోసం గాలించారు.

ఎక్కడా దొరక్కపోతే ఇక మిగిలింది నదే అని, నదిలో పడిపోయివుండవచ్చని అనుమానం రావడంతో రెస్క్యూటీమ్‌కు సమాచారం అందించారు.

గాలింపు చర్యలు చేపట్టిన సహాయక బృందానికి 17 గంటల తరువాత ఆ వృద్ధుని మృతదేహం నదిలో లభ్యమైంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?