చక్కెర, చక్కెరతో తయారు చేసిన స్వీట్లు, బేకరీ పదార్థాల జోలికి అస్సలు వెల్లకూడదు.
ఎందుకంటే.వీటిని తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ క్రమంగా పెరిగి గుండె జబ్బులకు దారి తీస్తుంది.
అలాగే కొందరు టీ, కాఫీలను పరిమితికి మించి తాగుతారు.అయితే నలబై ఏళ్లు దాటిన పురుషులు టీ, కాఫీలను అతిగా తీసుకుంటే అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తరచూ ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందు వల్ల టీ, కాఫీలను మితంగా తీసుకోవాలి.లేదంటే వాటిని పూర్తిగా తీసుకోవడం మానేసి హెర్బల్ టీలను ఎంచుకోవాలి.
నలబై ఏళ్లు దాటిన పురుషులు ఉప్పు చాలా అంటే చాలా లిమిట్‌గా వాడాలి.
లేదంటే రక్త పోటు అదుపు తప్పుతుంది. """/"/ మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులూ సక్రమిస్తాయి.
ప్రాసెస్డ్ మాంసాన్ని పొరపాటును కూడా తీసుకోరాదు.ప్రాసెస్ చేసిన మాంసం గుండె వ్యాధులతో పాటు ప్రాణాంతకర క్యాన్సర్‌కి కారణం అవుతుంది.
ఇవే కాకుండా.కూల్‌డ్రింక్స్, వేయించిన ఆహారాలు, ప్యాక్ చేసిన ఆహారాలు, నూనె ఆహారాలు, మైదా, బాగా పాలిష్ చేసిన బియ్యం, బ్రెడ్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటికి సైతం దూరంగా ఉంటూ పోషకాహారాలను డైట్‌లో చేర్చుకోవాలి.
అప్పుడే వయసు పెరిగినా ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
సుధీర్ పెళ్లి గురించి షాకింగ్ విషయాలు రివీల్ చేసిన కమెడియన్ భార్య.. అలా చెప్పడంతో?