ఈ ఒక్క రెమెడీని ట్రై చేస్తే పురుషులు ర‌ఫ్ స్కిన్‌కు గుడ్‌బై చెప్పొచ్చు!

ర‌ఫ్ స్కిన్‌.పురుషుల‌ను ప్ర‌ధానంగా వేధించే స‌మ‌స్య ఇది.

స్త్రీల‌తో పోలిస్తే మ‌గ‌వారి చ‌ర్మం కాస్త ర‌ఫ్‌(కఠినం)గా ఉంటుంది.దాంతో వారి యంగ్ లుక్ తీవ్రంగా దెబ్బ తింటుంది.

అందుకే క‌ఠిన‌మైన చ‌ర్మాన్ని మృదువుగా మ‌రియు య‌వ్వ‌నంగా మార్చుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే క్రీమీలెన్నో వాడ‌తారు.అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుంటే ఏం చేయాలో అర్థంగాక కృంగిపోతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ రెమెడీని ట్రై చేస్తే పురుషులు ర‌ఫ్ స్కిన్‌కు గుడ్‌బై చెప్పేయ‌వ‌చ్చు.

మ‌రి లేటెందుకు ఈ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ వాసెలిన్ వేసుకోవాలి.

ఆ త‌ర్వాత వ‌న్ టేబుల్ స్పూన్ కోక‌న‌ట్ ఆయిల్, వ‌న్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌, రెండు చుక్క‌లు విట‌మిన్ ఇ ఆయిల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టి వాట‌ర్ పోయాలి. """/"/ వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో అన్ని ప‌దార్థాలు వేసుకున్న గిన్నెను పెట్టి డ‌బుల్ బాయిల‌ర్ మెథ‌డ్‌లో ఒక నిమిషం పాటు హీట్ చేసుకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసి హీట్ చేసుకున్న మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌బెట్టుకోవాలి.బాగా కూల్ ఆయిన వెంట‌నే అందులో వ‌న్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్ జెల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/"/ ఆపై ఈ మిశ్ర‌మాన్ని ఒక బాక్స్‌లో నింపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు.

ప్ర‌తి రోజు ముఖానికి ఈ మిశ్ర‌మాన్ని అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు సున్నితంగా మ‌సాజ్ చేసుకోవాలి.

గంట లేదా రెండు గంటల అనంత‌రం నార్మ‌ల్ వాట‌ర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒక‌సారి చేస్తే క‌ఠిన‌మైన చ‌ర్మం మృదువుగా, కోమ‌లంగా మ‌రియు న‌వ‌య‌వ్వ‌నంగా మారుతుంది.