పురుషులు వారంలో 2 సార్లు ఈ హెయిర్ సీరంను వాడితే బట్టతలకు దూరంగా ఉండవచ్చు!
TeluguStop.com
బట్టతల.పురుషుల్లో అత్యంత కలవర పెట్టే సమస్యల్లో ఒకటి.
వయసు పైబడిన తర్వాత బట్టతల ఏర్పడినా పురుషులు పెద్దగా పట్టించుకోరు.కానీ పెళ్లికి ముందే బట్టతల వచ్చిందంటే ఇక వారి బాధ వర్ణనాతీతం.
ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఎంత మంచి ఉద్యోగం ఉన్నా సరే బట్టతల ఉన్న పురుషులకు మాత్రం పెళ్లి కావడం లేదు.
అందుకే బట్టతల అంటేనే భయపడతారు.అయితే బట్టతల వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ఉత్తమం.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.వారంలో రెండు సార్లు పురుషులు ఈ సీరంను వాడితే కనుక బట్టతలకు దూరంగా ఉండవచ్చు.
మరియు ఒత్తయిన జుట్టును తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరంను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ను వేసుకోవాలి.
"""/"/
అలాగే రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్ ఆయిల్, నాలుగు నుంచి ఐదు చుక్కలు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవాలి.
చివరిగా పది టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసి కనీసం ఐదు నిమిషాల పాటు ఆగకుండా మిక్స్ చేసుకుంటే మన సీరం సిద్ధమవుతుంది.
ఈ సీరం నైట్ నిద్రించే ముందు స్కాల్ప్ కు బాగా అప్లై చేసుకుని కాసేపు మసాజ్ చేసుకోవాలి.
మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.
"""/"/
వారంలో రెండు సార్లు ఈ హోమ్ మేడ్ హెయిర్ సీరంను కనుక వాడితే జుట్టు కుదుళ్లు బలంగా ఆరోగ్యంగా మారతాయి.
హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.బట్టతల సమస్య రాకుండా ఉంటుంది.
అలాగే ఈ హోమ్ మేడ్ హెయిర్ సీరంను వాడటం వల్ల తెల్ల జుట్టు సైతం త్వరగా రాకుండా ఉంటుంది.
కాబట్టి బట్టతల వస్తుంది అని భయపడుతున్న వారు తప్పకుండా ఈ హెయిర్ సీరంను వాడటం అలవాటు చేసుకోండి.
చిరంజీవి ప్రయోగాత్మకమైన సినిమాలు చేయబోతున్నాడా..?