నా కోరిక తీర్చక పోతే నీ భర్త ను లేపేస్తా అంటూ…

దేశంలో ఆడవాళ్లపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు, చట్టాలు తెచ్చినప్పటికీ మహిళలపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు మాత్రం ఆగడం లేదు.

  తాజాగా ఓ వ్యక్తి ఓ పెళ్లయిన మహిళను తన లైంగిక కోరిక తీర్చకపోతే ఏకంగా మహిళ భర్తను చంపేస్తానంటూ బెదిరించిన ఘటన దేశంలోని హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే వివాహిత స్థానిక రాష్ట్రానికి చెందినటువంటి గురుగ్రామ్ అనే ప్రాంతంలో తన భర్తతో కలిసి నివాసం ఉంటోంది.

అయితే ఇదే ప్రాంతంలో వీరేంద్ర అనే వ్యక్తి కూడా నివాసముంటున్నాడు.గత కొద్ది కాలంగా వీరేంద్ర వివాహితపై కన్నేశాడు.

ఈ క్రమంలో ఆమెని లోబర్చుకోవాలని పలు ప్రయత్నాలు చేసేవాడు.అయితే వీరేంద్ర కోరికను పసిగట్టినటువంటి వివాహిత అందుకు ఒప్పుకోలేదు.

దీంతో యువకుడు ఎలాగైనా వివాహితను లోబర్చుకోవాలనే నెపంతో బెదిరించి సాగాడు.ఈ క్రమంలో తనకు గుండాలతో సత్సంబంధాలు ఉన్నాయని ఒకవేళ తన కోరిక తీర్చకపోతే  తన భర్తను హత్య చేస్తానని భయపెట్టసాగాడు.

దీంతో భయాందోళనకు గురైనటువంటి వివాహిత దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించింది.ఇందులో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి వీరేంద్ర అనే వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్నట్లు వంటి వీరేంద్ర పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివాహిత తెలిపినటువంటి వివరాల మేరకు పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని నిందితుడు వీరేంద్రని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

90 దేశాలు తిరిగినా భారత్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్.. ఈ అమ్మాయి వీడియో చూస్తే..