అల్లుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని… మామ, కూతురు కలిసి…
TeluguStop.com
ప్రస్తుత కాలంలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కలలు కంటూ ఉద్యోగస్తులమని చెప్పి మోసం చేసే వారి వలలో పడి మోస పోతున్నారు.
తాజాగా ఓ వ్యక్తి తన కన్న కూతురు జీవితం బాగుండాలని సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేసాడు.
చివరికి తన అల్లుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయట్లేదని అంతేగాక అతడికి ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయని తెలుసుకుని తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోగా తన ఇద్దరు కూతుర్లు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో కలకలం సృష్టించింది.
మృతుల కుటుంభ సభ్యులు తెలిపిన వివరాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రంగంలోకి దిగి మృతుడి అల్లుడు ఓబుల్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది.
మృతుడి అల్లుడు ఓబుల్ రెడ్డి తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించి శ్వేత అనే యువతిని పెళ్లి చేసుకున్న మాట వాస్తవమేనని అంతేగాక పెళ్లి చేసుకున్న సమయంలో శ్వేత తల్లి దండ్రులు తనకి భారీ మొత్తంలో కట్న, కానుకలు సమర్పించారని కూడా విచారణలో తెలిపాడు.
అలాగే తనకి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తన భార్య కి తెలియడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు.
దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్వేత కుటుంబ సభ్యులు పెళ్లికి ముందు తప్పుడు మాటలు నమ్మబలికి శ్వేత తో పాటు తన చెల్లి, తండ్రి మృతికి కారణమైన ఓబుల్ రెడ్డి ని దారుణంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.
అయితే ఈ విషయంపై స్పందించిన టువంటి పోలీసులు ఈమధ్య కాలంలో కొందరు కేటుగాళ్లు ఇతర పట్టణాలు, నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నామంటూ అమాయకపు తల్లిదండ్రులను మోసం చేస్తూ కట్న, కానుకలు దండుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారని కాబట్టి తమ కూతురికి సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకునే సమయంలో కొంతమేర జాగ్రత్త నిర్వహించాలని కోరుతున్నారు.
అంతేగాక ఇలాంటి కేటుగాళ్లు ఎక్కడైనా అగుపిస్తే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
వైరల్ అవుతున్న క్లీంకార లేటెస్ట్ ఫోటోలు.. ఎంత ముద్దుగా ఉందో అంటూ?