డిజిటల్ పరికరాలతో జ్ఞాపకశక్తి పెరుగుతుందట..

డిజిటల్ పరికరాలు మన మెదడుపై ప్రతికూల ప్రభావం చూపాతాయని వాదనలు ఉన్నాయి.స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డైవిజ్ లు వచ్చిన తర్వాత సమాచారాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరాన్ని తగ్గించాయి.

దీంతో స్వంత జ్ఞాపకశక్తికి పనిలేకుండా పోయింది.అయితే ఇది మన జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుందని ఇప్పటికే ఎంతో మంది నిపుణులు చెప్పారు.

అయితే ఇందులో నిజం లేదని తాజా అధ్యయనం చెబుతోంది.కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని స్టోర్ చేయడానికి, గుర్తుంచుకోవడానికి ప్రజలు డిజిటల్ పరికరాలపై ఆధారపడుతున్నారు.

అలా చేయడం ద్వారా నష్టం లేదని, మెదడుకు మరిన్ని విషయాలు గుర్తు పెట్టుకోవడానికి స్వేచ్ఛ లభిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది.

డిజిటల డివైజ్ లను ఎక్కువ వినియోగించడం వల్ల జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని జర్మన్ న్యూరో సైంటిస్ట్ మాన్ ఫ్రెడ్ స్పిట్జర్ హెచ్చరించారు.

దీని ద్వారా ఆమ్నేషియా ఏర్పడుతుందని ఆయన ప్రతిపాదించాడు.కానీ తన వాదనను నిరూపించలేకపోయాడు.

అయితే డిజిటల్ పరికరాల వినియోగంతో ఇతర విషయాలు ఆలోచించేందుకు మెదడులో ఖాళీ సమయం ఏర్పడిందని యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాగ్నిటివ్ న్యూరో సైన్స్ కి చెందిన డాక్టర్ సామ్ గిల్ బర్ట్ పేర్కొన్నారు.

యూనివర్సిటీ కాలేజ్ లండన్ సభ్యల నేతృత్వంలో ఓ ప్రత్యేక మెమోరీ గేమ్ ని అభివృద్ధి చేశారు.

"""/"/డిజిటల్ పరికరాల్లో రిమైండర్లను వాడుకుంటూ, ఒక్కోసారి వాడకుండా 158 మంది వాలంటీర్లతో గేమ్ ఆడించారు.

డిజిటల్ రిమైండర్ ఉపోయగించినప్పుడు ఫలితాలు పాజిటివ్ గా వచ్చాయి.పరికరాన్ని ఉపయోగించడం వలన ప్రజలు తమ మెమరీని అధిక-ప్రాముఖ్యత మరియు తక్కువ-ప్రాముఖ్యత సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే విధానాన్ని మార్చారు.

ప్రజలు తమను తాము గుర్తుంచుకోవలసి వచ్చినప్పుడు, వారు చాలా ముఖ్యమైన సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి వారి మెమరీ సామర్థ్యాన్ని ఉపయోగించారు.

"""/"/ కానీ వారు పరికరాన్ని ఉపయోగించగలిగినప్పుడు, వారు పరికరంలో అధిక-ప్రాముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేసారు.

బదులుగా తక్కువ ముఖ్యమైన సమాచారం కోసం వారి స్వంత మెమరీని ఉపయోగించారని డాక్టర్ గిల్బర్ట్ వివరించారు.

డిజిటల్ డిమెన్షియాకు కారణం కాకుండా, బాహ్య మెమరీ పరికరాన్ని ఉపయోగించడం వల్ల మనం ఎప్పుడూ సేవ్ చేయని సమాచారం కోసం మన మెమరీని కూడా మెరుగుపరుస్తుంది.

కానీ మనం చాలా ముఖ్యమైన సమాచారాన్ని బ్యాకప్ చేసేలా జాగ్రత్త వహించాలి.లేకపోతే, మెమరీ సాధనం విఫలమైతే, మన స్వంత మెమరీలో తక్కువ-ప్రాముఖ్యమైన సమాచారం తప్ప మరేమీ ఉండదు.

థియేటర్లలో యావరేజ్ బుల్లితెరపై అదుర్స్.. గుంటూరు కారం మూవీ టీఆర్పీ లెక్క ఇదే!