బిగ్‌బాస్ పై మొదలైన మీమ్స్.. ఎవరు భయ్యా వీళ్లంతా?
TeluguStop.com
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 షురూ అయ్యింది.బిగ్ బాస్ అంటేనే సోషల్ మీడియాలో సందడి.
ఒక్కో కంటెస్టెంట్ కు వందల కొద్ది గ్రూప్ లు సోషల్ మీడియా అకౌంట్లు ఉంటాయి.
నెట్టింట ఎక్కడ చూసినా కూడా బిగ్ బాస్ ముచ్చట్లు కనిపిస్తూ ఉంటాయి.పెద్ద ఎత్తున బిగ్ బాస్ గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారం మరియు కంటెస్టెంట్స్ గురించి మచ్చట్లు విమర్శలు ఎన్నో వస్తూ ఉంటాయి.
ఇక బిగ్ బాస్ అనగానే మీమర్స్ కు పండుగ వాతావరణం అనడంలో సందేహం లేదు.
ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే మీమ్స్ పంట పండించే అవకాశం ఉంటుంది.మీమర్స్ వందల కొద్ది మీమ్స్ ను బిగ్ బాస్ మీద వదులుతూ ఉంటారు.
నిన్న షో మొదలు అయిన వెంటనే ఎక్కువ శాతం మంది ఒకే ఒక్క మీమ్ ను షేర్ చేశారు.
అదే కంటెస్టెంట్స్ లో ఎక్కువ శాతం మంది కనీసం ఎప్పుడు చూసిన ఫేస్ లు కూడా కాదు.
ఒక అయిదు ఆరుగురు ఎవరు అనే విషయం కూడా తెలియదు.వారి పేర్లు పక్కన పెడితే ఒక్కసారి అయినా జనాల్లో కనిపించిన పేసులు కాదు.
కేవలం ముగ్గురు మాత్రమే కాస్త గుర్తింపు ఉన్న ఫేస్ లు ఉన్నాయి. """/"/ సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్ ఉన్న వారికి కూడా కొందరు ఎవరో తెలియడం లేదు.
అంటే వారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.మరీ దారుణంగా ఇలాంటి వారిని తీసుకు వచ్చావేంటి బిగ్ బాస్ భయ్యా అంటూ కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం బిగ్ బాస్ వీళ్లంతా నీ బందువులా అందుకే తీసుకు వచ్చావా అంటూ మీమ్స్ ను షేర్ చేస్తున్నారు.
మొత్తానికి ముక్క మొహం తెలియని కంటెస్టెంట్స్ అంటూ ట్రోల్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి.
అఖిల్ పెళ్లి విషయంలో సైలెంట్ అయిన అక్కినేని ఫ్యామిలీ.. ఎప్పుడు క్లారిటీ ఇస్తారో?