కానిస్టేబుల్ గా ఎంపికైన యువకుడికి సన్మానించిన ప్రజాప్రతినిధులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కొడిమ్యాల సాయి కృష్ణ( Sai Krishna ) అనే యువకుడు ఇటీవల వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో సివిల్ కానిస్టేబుల్( Civil Constable ) గా ఎన్నిక కావడం జరిగింది.

ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్, ప్రజా ప్రతినిధులు కలిసి వారి స్వగృహంలో కానిస్టేబుల్ గా ఎంపికైన సాయికృష్ణను వారి తల్లిదండ్రులను వరలక్ష్మి కుబేర స్వామి లను శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, వార్డు సభ్యులు ఏర్పుల శ్రీనివాస్, సుంకి భాస్కర్ తదితరులు ఉన్నారు.

మహేష్ పాస్ పోర్ట్ సీజ్ చేసిన రాజమౌళి… దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన మహేష్!