పౌర హక్కుల దినోత్సవం లో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు అజ్మీర తిరుపతి నాయక్( Tirupati Naik ) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కులమత లింగ బేదాలకు అతీతంగా దేశంలో మానవ హక్కుల పరిరక్షణకు జాతీయ రాష్ట్రస్థాయిలో మానవ హక్కుల కమిషన్లు( Human Rights Commissions ) ఏర్పాటు అవకాశం కల్పిస్తూ 1993 లో జాతీయ హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

కులమత బేధాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎం మధుకర్, ఉప సర్పంచ్ ప్రదీప్ రెడ్డి అధికారులు ఆర్ఐ,హెడ్ కానిస్టేబుల్ భాష వీ పి ఓ రమేష్, గ్రామ ప్రజలు చందర్ రావు,రాజు,నవీన్ శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు.

వృద్ధురాలే కానీ బ్రెడ్ పకోడీలు ఎంత ఫాస్ట్‌గా చేస్తుందో చూస్తే..??