మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మిత్ర యూత్ సభ్యులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి గ్రామానికి చెందిన పంగ దేవయ్య ( Panga Devaya )(సెంట్రింగ్ వర్కర్) అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి బోయినపల్లి మిత్ర యూత్ సభ్యులు 5000 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.

మృతినికిని ఒక కొడుకు కూతురు ఉండగా మృతుని భార్య గత 20 సంవత్సరాల క్రితం మృతి చెందగా మృతుడు దేవయ్య నే కొడుకు కూతురు ఆలన పాలన చూసి పెద్ద చేయగా ప్రస్తుతం దేవయ్య కుమారుడు ఉపాధి నిమిత్తం గల్ఫ్ లో ఉన్నాడు.

ఈ నిరుపేద కుటుంబానికి యువ మిత్ర యూత్ సభ్యులు తమవంతు సహయంగా 5000/- రూపాయలు సహాయం చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబం అందరి సహాయం కోసం ఎదురు చూస్తుందనీ ప్రతి ఒక్కరూ తోచినంత సహాయం చేయగలరనీ కోరారు.

ఈ కార్యక్రమంలో యువ మిత్ర యూత్ సభ్యులు పాల్గొన్నారు.

చెక్‌బౌన్స్‌ కేసులో రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష