అమెరికా: భారత్‌కు ఆయుధ విక్రయాలు వేగవంతం .. కీలక చట్టం ప్రవేశపెట్టిన ఇండియా కాకస్ సభ్యులు

అమెరికా చట్టసభల్లోని శక్తివంతమైన ఇండియా కాకస్ సభ్యులు.భారతదేశ రక్షణ అవసరాల నేపథ్యంలో ఓ ద్వైపాక్షిక చట్టాన్ని ప్రవేశపెట్టారు.

భారతదేశం తనను తాను రక్షించుకోవడంతో పాటు .వ్యూహాత్మక ఇండో పసిఫిక్ ప్రాంతంలో( Indo Pacific Region ) యూఎస్‌తో తన భద్రతా లక్ష్యాలను పెంచుకోవడానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చుకోవడానికి ఈ చట్టం ఉద్దేశించింది.

ఇండో అమెరికన్ నేతలు, డెమొక్రాటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యులు రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, మార్క్( Raja Krishnamurthy, Ro Khanna, Mark ) వీసీలతో పాటు రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు ఆండీ బార్, మైక్ వాల్డ్జ్‌లతో కలిసి ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు.

అమెరికా నుంచి భారతదేశానికి ఆయుధ విక్రయాలను వేగంగా ట్రాక్ చేయడానికి, ఇండో యూఎస్ రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి యాక్సెస్ చేసేలా చట్టాన్ని ప్రవేశపెట్టారు.

"""/" / అమెరికా సెనేట్‌లో డెమొక్రాటిక్ సెనేటర్ వార్క్ వార్నర్( Democratic Senator Wark Warner ) , రిపబ్లికన్ సెనేటర్ జాన్ కార్నిర్ కూడా చట్టానికి మద్ధతు ప్రకటించారని రాజా కృష్ణమూర్తి( Raja Krishnamurthy ) కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఆయుధాల ఎగుమతి నియంత్రణ చట్టం కింద.ఫారిన్ మిలటరీ సేల్స్ (ఎఫ్ఎంఎస్), ఎగుమతుల సమీక్ష , విక్రయ ప్రక్రియను క్రమబద్ధీకరించడం, వేగవంతం చేయడం ద్వారా అమెరికా భాగస్వాములు, మిత్రదేశాలతో భారత్ సమానంగా వుంటుందని బార్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

"""/" / ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) అమెరికా పర్యటన ముగించిన కొద్దిరోజులకే ఇండియా కాకస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మోడీ పర్యటన సందర్భంగా భారత్-అమెరికాల మధ్య ద్వైపాక్షిక రక్షణ మైత్రి మరింత బలోపేతం దిశగా కీలక ముందడుగు పడిన సంగతి తెలిసిందే.

యూఎస్ ఏరోస్పేస్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) , హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌తో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది.

భారత్ దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ మార్క్ 2 యుద్ధ విమానాల కోసం ఫైటర్ జెట్ ఇంజిన్లను హెచ్ఏఎల్‌తో కలిసి జీఈ ఉత్పత్తి చేయనుంది.

ఈ ఒప్పందం ఫలితంగా జీఈ అభివృద్ధి చేసిన ఎఫ్ 414 -ఐఎన్ఎస్ 6 ఇంజిన్లను తేజస్ మార్క్ 2 యుద్ధ విమానాల్లో వినియోగించనున్నారు.

వైరల్ వీడియో: ట్రెండ్ మారింది.. అబ్బాయి కోసం అమ్మాయిలు డిష్యుం.. డిష్యుం..