రామ్ చరణ్ తో సెల్ఫీ వల్ల నా కల నెరవేరింది.. మెల్ బోర్న్ మేయర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్( Game Changer ) మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తన ఫ్యామిలీతో కావాల్సిన సమయాన్ని గడుపుతున్నారు చెర్రీ.

ఇకపోతే రామ్‌ చరణ్‌ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో( Melbourne ) ఇటీవల సందడి చేసిన సంగతి తెలిసిందే.

ది ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ కు గౌరవ అతిథిగా హాజరైన ఆయన అక్కడి అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు.

"""/" / తాజాగా దీనిపై మెల్‌బోర్న్‌ మేయర్‌ నిక్‌ రీస్‌( Mayor Nick Reece ) పోస్ట్‌ పెట్టారు.

తాను కూడా రామ్‌ చరణ్‌ కు వీరాభిమానినని పేర్కొన్నారు.ఆ పోస్టులో ఆయన ఈ విధంగా రాసుకొచ్చారు.

మన నగరాన్ని గొప్పగా మార్చడంలో ఇక్కడ ఉంటున్న భారతీయులు పెద్ద పాత్ర పోషిస్తున్నారు.

డిప్యూటీ మేయర్‌ అభ్యర్థి రోషెనాతో కలిసి నేను తాజాగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వెళ్లాను.

రామ్‌ చరణ్‌తో కలిసి సెల్ఫీ తీసుకున్నా.నా కోరిక తీరింది.

నాకున్న విష్‌ లిస్ట్‌లలో ఒకటి నెరవేరింది అంటూ చరణ్‌ పై తనకున్న అభిమానాన్ని తెలిపారు.

అక్టోబర్‌లో డిప్యూటీ మేయర్‌గా రోషెనా ( Roshena ) ఎన్నికైతే ఆమె చరిత్ర సృస్టిస్తారు.

"""/" / 182 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ స్థానాన్ని పొందిన భారతీయ వారసత్వపు మొదటి వ్యక్తి ఆమె అవుతారు.

ఆమెతో కలిసి ఈ ఈవెంట్‌కు వెళ్లినందుకు చాలా ఆనందంగా ఉంది.అని నిక్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఈ ఫొటోలను రామ్‌చరణ్‌ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు.అందుకే చరణ్‌ను గ్లోబల్‌ స్టార్‌( Global Star ) అంటారు అని ఒకరు కామెంట్‌ చేయగా, త్వరలోనే గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్‌ అవుతుంది.

తప్పక చూడండి అని మరొకరు కోరారు.ప్రస్తుతం చెర్రీ అభిమానులు ఆ ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

నేను చేసిన పనికి కొందరు తిట్టుకుంటున్నారు.. రష్మిక షాకింగ్ కామెంట్స్ వైరల్!