అమెరికా మాజీ ప్రథమ మహిళ రోసలిన్ కార్టర్ అంత్యక్రియలు.. హాజరైన జిల్ బైడెన్, మెలానియా, మిచెల్, హిల్లరీ
TeluguStop.com
దివంగత అమెరికా ప్రథమ మహిళ, మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ సతీమణి రోసలిన్ కార్టర్ (96)( Rosalynn Carter ) అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి.
ఈ కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షులు, మాజీ ప్రథమ మహిళలు హాజరయ్యారు.జార్జియాలోని అట్లాంటాలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుతం జీవించి వున్న ఐదుగురు మాజీ ప్రథమ మహిళలు మెలానియా ట్రంప్,( Melania Trump ) మిచెల్ ఒబామా,( Michelle Obama ) జిల్ బైడెన్ ,( Jill Biden ) లారా బుష్, హిల్లరి క్లింటన్‌లు ఆమెకు నివాళులర్పించారు.
అధ్యక్షుడు జో బైడెన్ , మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆమె భర్త డగ్ ఎంహాఫ్ కూడా రోసలిన్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.
2018లో జార్జ్‌హెచ్ డబ్ల్యూ బుష్ అంత్యక్రియలు జరిగిన తర్వాత మాజీ ప్రథమ మహిళలంతా వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి.
మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామాలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పటికీ వారు అనివార్య కారణాలతో హాజరుకాలేదు.
"""/" /
ఈ సందర్భంగా మిచెల్ ఒబామా భావోద్వేగానికి గురయ్యారు.మా కుటుంబం వైట్‌హౌస్‌లో వున్నప్పుడు.
రోసలిన్ తనతో కలిసి ఎన్నోసార్లు భోజనం చేశారని గుర్తుచేసుకున్నారు.తనకు ఎన్నో విలువైన సలహాలు, సూచనలు చేస్తూ తోడుగా వున్నారని.
ఆమె సూచించిన విధంగానే ప్రథమ మహిళగా( US First Lady ) తన బాధ్యతలు నిర్వర్తించానని, తనకు అందించిన మద్ధతు, ఔదార్యానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు అని మిచెల్ రాశారు.
"""/" /
జార్జియా గవర్నర్ బ్రియాన్ కెంప్, జార్జియా ప్రథమ మహిళ మార్టీ కెంప్, అట్లాంటా మేయర్ ఆండ్రి డికెన్స్, జార్జియా కాంగ్రెస్ సభ్యులు, ఉన్నతాధికారులు రోసలిన్ అంత్యక్రియలకు( Rosalynn Carter Funeral ) హాజరయ్యారు.
ఎమోరీ యూనివర్సిటీ క్యాంపస్‌లో వున్న గ్లెన్ మెమొరియల్ యునైటెడ్ మెథడిస్ట్ చర్చ్ స్మారక సేవను నిర్వహించగా.
బుధవారం ప్లెయిన్స్‌లోని మరనాథ బాప్టిస్ట్ చర్చి( Maranatha Baptist Church ) అంత్యక్రియల సేవను నిర్వహించింది.
జిమ్మీకార్టర్ నేషనల్ హిస్టారికల్ పార్క్‌లో భాగమైన కార్టర్ హోమ్ అండ్ గార్డెన్‌లో ఆమెను ఖననం చేశారు.
రోసలిన్ కార్టర్ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు.ఈ ఏడాది మేలో ఆమెకు ‘‘dementia ’’ నిర్ధారణ అయ్యింది.
1977-81 మధ్య జిమ్మి కార్టర్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు.
డాకు మహారాజ్ మూవీకి ఆ సీన్స్ హైలెట్ కానున్నాయా… బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!