మేకపాటి వర్సెస్ మేకపాటి ! దరిద్రపు ప్రమాణాలంటూ…
TeluguStop.com
ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడి వైసిపి అధిష్టానం ఆగ్రహానికి గురవడం తో పాటు సస్పెండ్ అయిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి( MLA Mekapati Chandrasekhar Reddy ) పై ఇప్పటికే విమర్శలు వస్తూనే ఉన్నాయి.
ఈ వ్యవహారంపై తాజాగా ఆయన సోదరుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజా మోహన్ రెడ్డి( Mekapati Raja Mohan Reddy ) సంచలన విమర్శలు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ పాల్పడడం తనను ఎంతగానో బాధించిందని రాజా మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
డబ్బులు తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డాడు కాబట్టే , అతడిని పార్టీ సస్పెండ్ చేసిందని, డబ్బులు తీసుకోకపోతే ఎందుకు సస్పెండ్ చేస్తారు అంటూ రాజా మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
"""/" /
ఈ విషయం ముందుగానే తనకు తెలియడంతో, చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల ద్వారా వారించే ప్రయత్నం చేశానని , ఆయన తన మాట వినలేదని, ఆయన ఈ విషయంలో చేస్తానన్న ప్రమాణాలన్నీ దరిద్రపు ప్రమాణాలు అంటూ రాజా మోహన్ రెడ్డి మండిపడ్డారు.
క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం కరెక్టేనని , ఉదయగిరి( Udayagiri )లో జరుగుతున్న పరిణామాలకు తాను కారణం అంటూ చంద్రశేఖర్ రెడ్డి తనపై విమర్శలు చేయడం పై రాజా మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రశేఖర్ రెడ్డి ని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన తరువాత, ఆయన పక్కన తిరిగే వారే ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారని రాజమోహన్ రెడ్డి గుర్తు చేశారు.
తాను ఏంటో , తన వ్యక్తిత్వం ఏంటో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని, వచ్చే ఎన్నికల్లో ఉదయగిరిలో మేకపాటి కుటుంబ సభ్యులు పోటీ చేసే విషయం పై జగన్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధిస్తుందని రాజా మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
రూ.100లోపే ఇల్లు కొనేసింది.. ఇప్పుడు ఆ ఇంటి లుక్కు చూస్తే ఆశ్చర్యపోతారు..