ఆ అవకాశం కోసం డైరెక్టర్ కు తెగ ఫోన్లు చేస్తున్న ముద్దుగుమ్మ..

సినిమా పరిశ్రమలోని నటీనటులకు కొన్ని కోరికలుంటాయి.ఫలానా వారితో వారితో నటించాలనే భావిస్తుంటారు.

ఎప్పుడో ఒకసారి తమ కోరిక తీరకపోతుందా? అని ఎదురు చూస్తుంటారు.అలాంటి ఓ అవకాశాన్ని పొందేందుకే ఓ టాలీవుడ్ హీరోయిన్ తహతహలాడుతోందట.

అతడితో ఛాన్స్ ఇస్తే చాలు.ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోను అంటున్నది.

డైరెక్టర్ కు కాల్ చేసి మరీ ఈ విషయాన్ని చెప్తుందట.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వార్త చూడాల్సిందే.

ప్రభాస్ తో నటించాలని తహతహలాడుతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.మెహ్రీన్.

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

నాని పక్కన బొద్దుగా క్యూట్ గా కనిపిస్తూ అల్లరి పిల్లలా గుర్తింపు తెచ్చుకుంది.

తొలి సినిమాతోని మంచి విజయాన్ని అందుకుంది.ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి.

కానీ.కథల ఎంపికలో చేసిన పొరపాట్ల మూలంగా మంచి సక్సెస్ అందుకోలేకపోయింది.

ప్రస్తుతం పలు అవకాశాలన దక్కించుకుంటూ.మళ్లీ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.

మంచి స్టోరీ లైన్ ఉన్నసినిమాలను మాత్రమే చేస్తుంది.హిట్లు లేకపోయినా.

యావరేజ్ టాక్ అయినా తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. """/"/ ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎఫ్ 3 సినిమా చేస్తుంది.

ఇందులో వరుణ్ తేజ్ తో సరసన నటిస్తోంది.అటు ప్రభాస్ తర్వాత మూవీలో అవకాశం కోసం ట్రై చేస్తుందట.

ప్రభాస్-మారుతి కాంబోలో త్వరలో ఓ సినిమా తెరకెక్కనుంది.ఇందులో అవకాశం కోసం ఈ అమ్మడు బాగా ట్రై చేస్తుందట.

ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ఈ అమ్మడు ఇప్పటికే సినిమాలు చేసింది. """/"/ ఆయనతో ఉన్న చనువు కారణంగా ప్రభాస్ ప్రాజెక్టులో హీరోయిన్ గా అవకాశం ఇవ్వాలని అడుగుతుందట.

అంతేకాదు.రెమ్యునరేషన్ గురించి కూడా చాలా కీలక విషయం చెప్పిందట.

ప్రభాస్ తో ఛాన్స్ ఇప్పిస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోనని చెప్పిందట.మొదటి హీరోయిన్ కాకపోయినా.

సెకెండ్ హీరోయిన్ గా అయినా అవకాశం ఇవ్వాలని కోరుతుందట.ఇందుకోసం సదరు దర్శకుడికి ఫోన్ల మీద ఫోన్లు చేస్తుందట ఈ అల్లరి పిల్ల.

మారుతి ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.

ట్రంప్ ఆ ప్లాన్‌ ప్రకటించగానే.. నవ్వు ఆపుకోలేకపోయిన హిల్లరీ క్లింటన్!