చిరు డైరెక్టర్ తో పవన్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట!

ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్లు చాలా మందే ఉన్నారు.అయితే ఎంత టాలెంట్ ఉన్న కూడా వారి సినిమాల విషయంలో మాత్రం అది ఎంత మాత్రం కలిసి రాదు.

అలాంటి డైరెక్టర్ల లిస్టులో ముందు వరుసలో ఉంటాడు మెహర్ రమేష్.ఈయన శక్తి, షాడో వంటి సినిమాలు తీసి అట్టర్ ప్లాప్ ఎదుర్కున్నాడు.

అప్పటి నుండి ఈయన టాలీవుడ్ లో కనిపించలేదు.అయితే ఈయన సినిమాలు చేయక పోయిన ఎన్నో సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ విషయాలు చూసుకున్నాడు.

ఇలా గ్యాప్ లేకుండా వర్క్ అయితే చేస్తున్నాడు కానీ ఆయన సొంతంగా సినిమా చేసింది లేదు.

మరి ఈ మధ్యనే మధ్యనే మెగాస్టార్ ఈయన పనితనం నమ్మి ఒక సినిమా బాధ్యతలు అప్పగించాడు.

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ సగం పూర్తి చేసుకుంది.

వరుస సినిమాలు ప్లాప్ అయినా ఈయనకు చిరు నమ్మకంతో అవకాశాన్ని ఇచ్చాడు.దీంతో ఈ సినిమాతో తనని తాను నిరూపించు కోవాలని మెహర్ రమేష్ పట్టుదలగా ఉన్నారు.

ఇక అన్నయ్య బాటలోనే ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా నడుస్తున్నట్టు టాక్ వస్తుంది.

ఈయనకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.తాజాగా మెహర్ రమేష్ ఒక ఇంటర్వ్యూలో 100% పవన్ తో సినిమా చేస్తాను అనే గట్టి నమ్మకంతో చెప్పాడు.

దీంతో ఈయన ధీమా చూసిన వారంతా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబట్టే అలా చెప్పాడు అంటున్నారు.

ఇక ఈ కాంబోలో వెంటనే సినిమా స్టార్ట్ అవుతుంది అని కుడి అంటున్నారు.

మొత్తానికి అన్న నమ్మి అవకాశం ఇచ్చినట్టు తమ్ముడు కూడా ఈయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అనేది ముందు ముందు తెలుస్తుంది.

"""/"/ ఇక చిరు భోళా శంకర్ తో పాటు పవన్ తో చేసే సినిమా కూడా హిట్ అయితే చరణ్, ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్ హీరోల నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది.

ఇక ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి.అందులో సెట్ మీద ఉంది మాత్రం క్రిష్ దారకత్వంలో హరిహర వీరమల్లు అనే చెప్పాలి.

ఆ తర్వాత ఈయన లైనప్ లో వినోదయ సీతమ్ రీమేక్, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి.

ప్రశాంత్ మూవీ కోసం ఆ రాష్ట్రానికి వెళ్లనున్న ఎన్టీఆర్.. తొలిసారి అలా చేస్తున్నారా?