పాపం ఆ నటి.. చనిపోయిన భర్తని మర్చిపోలేకపోతుంటే.. ఇంకో పెళ్లి చేసుకుంటుందంటూ షాకింగ్ కామెంట్స్?

కన్నడ స్టార్ హీరో దివంగత నటుడు చిరంజీవి సర్జా మరణించిన విషయం తెలిసిందే.

2020లో జూన్ 7వ తేదీన, కేవలం 35 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

ఈయన మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా తీవ్ర ద్రిగ్బంతికి లోనయ్యింది.చిరంజీవి మరణంతో ఆయన సతీమణి, నటి మేఘనా రాజ్ ఎంతగానో కుంగిపోయింది.

కాగా చిరంజీవి చనిపోయే నాటికి ఆయన భార్య అయిదు నెలల గర్భవతి అన్న విషయం తెలిసిందే.

భర్త చనిపోయిన కొన్ని నెలల తర్వాత ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చింది.కాగా తన కుమారుడిలోనే తన భర్తను చూసుకుంటూ కాలం గడుపుతోంది.

ఆమె భర్త చనిపోయిన తర్వాత ఆమె రెండవ పెళ్లి అన్న ఆలోచన లేకుండా తన కొడుకులోనే తన భర్తను చూసుకుంటోంది.

ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా ఈమె త్వరలోనే రెండవ పెళ్లి చేసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా తాజాగా ఈ వార్తలపై ఆమె స్పందించింది.కొందరు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు.

ఇంకొందరు మాత్రం నా కొడుకును బాగా చూసుకుంటూ అతనితోనే ఉండమని చెబుతున్నారు.మరి నేను ఎవరి మాట వినాలి.

కానీ నా భర్త ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవాడు. """/"/ ఈ ప్రపంచం ఏమనుకుంటుంది అన్నది ఎప్పుడు పట్టించుకోకు నీ మనసుకు ఏది అనిపిస్తే అది చేయమని చెప్తూ ఉండేవాడు అని తెలిపింది మేఘనా రాజ్.

నా భర్త చనిపోయిన తర్వాత నేను ఎప్పుడూ మళ్ళీ పెళ్లి గురించి ప్రశ్నించుకోలేదు.

రేపు ఏం జరుగుతుంది.కొద్దిరోజుల తర్వాత నా జీవితం ఏ విధంగా ఉంటుంది అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు అని మేఘనా రాజ్ చెప్పుకొచ్చింది.

ఇకపోతే మేఘనా రాజ్, చిరంజీవి సర్జా రేపు 10 ఏళ్ల పాటు ప్రేమలో మునిగిన తర్వాత 2018 మే 18 న పెళ్లి చేసుకుని మూడుముళ్ల బంధంతో ఒక్కటే అయ్యారు.

కానీ వారి ఆనందం కొద్దిరోజులు మాత్రమే నిలిచింది.మేఘన గర్భవతి అయిన కొన్ని నెలలకే చిరంజీవి గుండెపోటుతో మరణించారు.

త్రినాధ్ రావు నక్కిన మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా..?