చనిపోయిన భర్త పేరు కొత్తగా టాటూ వేయించుకున్న నటి మేఘనా రాజ్.. నెట్టింట్లో వార్తలు వైరల్!

కన్నడ హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించిన విషయం మనందరికి తెలిసిందే.చిన్న వయసులోనే చనిపోవడంతో అటు ఇండస్ట్రీలో, ఇటు తన కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.

హీరోగా అప్పుడప్పుడే పరిశ్రమలో బాగా ఎదుగుతున్న సమయంలోనే అయినా కన్నుమూశారు.చిరంజీవి భార్య మేఘనా కూడా హీరోయిన్ అన్న విషయం తెలిసిందే.

మేఘన, చిరంజీవికి పెళ్లయి రెండేళ్లు అయింది.పెళ్లయి రెండు ఏళ్ళ తరువాత తన భర్త చనిపోవడంతో భార్య మేఘన కన్నీరు మున్నీరుగా విలపించింది.

అంతేకాకుండా తన భర్త చనిపోయే సమయానికి ఆమె గర్భవతి కూడా.భర్త చనిపోయిన కొన్ని నెలల తర్వాత మేఘనకు ఒక బాబు కూడా జన్మించిన విషయం తెలిసిందే.

అయితే చిరంజీవి మరణ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయన సతీమణి, నటి మేఘనా రాజ్‌.

తిరిగి తన కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది.ఇదిలా ఉంటే ఆమె రెండో పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు పెద్ద ఎత్తున వినిపించడంతో ఆ విషయంపై ఆమె స్పష్టతను కూడా ఇచ్చింది.

"""/" / అవన్నీ కేవలం పుకార్లే అంటూ కొట్టి పారేసింది మేఘన రాజ్.

ప్రస్తుతం లాస్‌వెగాస్‌లో ఉన్న ఆమె చేతి పై పచ్చబొట్టు వేయించుకుంది.తన భర్త చిరంజీవి సర్జా, కొడుకు రాయన్‌ పేర్లను ఆమె తన చేతి మణికట్టు పై టాటూ వేసుకుంది.

వారు ఎప్పటికీ తనగుండెలో ఉండిపోతారు అని ఆమె చెప్పుకొచ్చింది.ఈ మేరకు ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటో కాస్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

బాయ్‌ఫ్రెండ్ భారతీయుడని తెలిసి పాకిస్థానీ గర్ల్ ఎలా రచ్చ చేస్తుందో చూడండి..