ఆడపిల్లకు చదువెందుకని హేళన.. తొలి ప్రయత్నంలో జడ్జి.. మేఘన సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!
TeluguStop.com
సమాజంలో నేటికీ ఆడపిల్లను చులకనగా చూసేవాళ్లు ఉన్నారు.అలా ఎన్నో అవమానాలు ఎదురైనా కెరీర్ పరంగా సక్సెస్ సాధించి స్పూర్తిగా నిలిచిన యువతులు సైతం ఎంతోమంది ఉన్నారనే సంగతి తెలిసిందే.
అలా కెరీర్ పరంగా ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొని సక్సెస్ సాధించిన యువతులలో మేఘన ఒకరు.
బాల్యంలో మేఘన( Meghana ) ఆదివాసీల సమస్యలను ప్రత్యక్షంగా కళ్లతో చూశారు.
"""/" /
తాను న్యాయవృత్తిని ఎంచుకుంటే మాత్రమే వాళ్ల సమస్యలను పరిష్కరించగలమని ఆమె భావించారు.
ఎంతో కష్టపడి న్యాయమూర్తి అయిన గడ్డం మేఘన సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటోంది.
మంచిర్యాల జిల్లా( Mancherial )లోని దేవాపూర్ గ్రామంలో గడ్డం మేఘన జన్మించారు.తల్లీదండ్రులకు మేఘన ఒక్కతే కూతురు కాగా కూతురిని ఉన్నత చదువులు చదివించాలని తల్లీదండ్రులు భావించారు.
"""/" /
అయితే మేఘనను తల్లీదండ్రులు చదివిస్తుంటే ఇరుగుపొరుగు వారు ఇష్టానుసారం కామెంట్లు చేశారు.
పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించిన మేఘన కరీంనగర్ లోని ప్రముఖ కాలేజ్ లో ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షల్లో 84వ ర్యాంకు సాధించడం గమనార్హం.
రోజుకు 14 గంటల ప్రిపరేషన్ తో మేఘన సివిల్స్ జడ్జిగా( Junior Civil Judge ) లక్ష్యాన్ని సాధించడం గమనార్హం.
పేదలకు న్యాయం అందేలా కృషి చేస్తానని మేఘన చెబుతుండటం గమనార్హం.తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరిస్తానని ఆమె చెబుతున్నారు.
ఆడపిల్లకు చదువెందుకని విమర్శలు చేసిన వాళ్ల నోర్లు మూయించి మేఘన ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.
మేఘన టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతుండటం గమనార్హం.మేఘన ఒక్కో మెట్టు పైకి ఎదిగి ప్రశంసలు అందుకోవడం గమనార్హం.
అబ్బాయి అమ్మాయి అనే తేడా లేకుండా పిల్లలను చదివిస్తే పిల్లలు తక్కువ సమయంలోనే సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
లక్ష్యాన్ని సాధించిన మేఘన ఈతరం యూత్ కు స్పూర్తిగా నిలుస్తారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
రొమేనియాలో షాకింగ్ ఘటన.. మహిళా యజమానిని పీక్కుతిన్న పెంపుడు కుక్కలు..