మెగా హీరోకి జోడీగా అవకాశం పట్టిన నితిన్ గర్ల్ ఫ్రెండ్

లై సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ భామ మేఘా ఆకాశ్.

తమిళంలో వరుస సినిమాలు చేస్తూ తనధైన గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్న ఈ భామ గ్లామర్ విషయంలో తెలుగు ఆడియన్స్ ని భాగానే ఆకట్టుకుంది.

అయితే లై సినిమా ఫ్లాప్ కావడంతో ఈ భామకి గుర్తింపు రాలేదు.ఇక రెండో సినిమాని కూడా నితిన్ తోనే చల్ మోహన రంగా అంటూ వచ్చింది.

అది కూడా డిజాస్టర్ అయ్యింది.దీంతో ఈ భామని తెలుగు దర్శకులు పట్టించుకోవడం మానేశారు.

ఇదిలా ఉంటే తెలుగులో సత్తా చాటి స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ఆశపడుతున్న ఈ భామకి ఊహించని ఆఫర్ వచ్చింది అని చెప్పాలి.

స్టార్ దర్శకుడు సుకుమార్ తన ప్రొడక్షన్ లోనే మెగా హీరో వైష్ణవ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా మేఘా ఆకాశ్ ని తీసుకున్నాడు.

మొత్తానికి ఇలా అయిన మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకి అదృష్టం కలిసి వస్తే మెగా హీరోలందరితో జత కట్టె అవకాశం వస్తుంది.

లేదంటే మళ్ళీ తమిళ సినిమానే దిక్కు అని చెప్పాలి.మరి ఈ భామ లక్ ఫ్యాక్టర్ లా ఉంటుందో వేచి చూడాలి.