2024 ఎన్నికల్లో తమ్ముడికి కోసం మెగాస్టార్ కీలక అడుగు..?
TeluguStop.com
ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు తిరుగుతున్నాయి.ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైం ఉండగానే అక్కడి రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.
ముఖ్యంగా అధికార పార్టీ ఈ మేరకు చర్యలు వేగవంతం చేసింది.ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూడా తమ కేడర్‌ను యాక్టివ్ చేస్తున్నాయి.
అయితే, వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీపీ,జనసేన , బీజేపీ పొత్తులతో ముందుకు వెళతాయని టాక్ వినిపిస్తోంది.
తమ్ముడి కోసం మెగాస్టార్
2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరుఆ ఎన్నికల్లో 18 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్నారు.
ఆయన కూడా ఎన్టీఆర్ వలే పార్టీ పెట్టాక సీఎం అవుతారని అంతా భావించారు.
కానీ అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గకపోవడంతో తిరిగి ఆయన ప్రభుత్వమే వచ్చింది.
ఆ తర్వాత కొంతకాలానికి చిరు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.అందుకు ప్రతిఫలంగా కేంద్రమంత్రి పదవిని చేపట్టారు.
"""/" /
ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసిన మెగాస్టార్ సినిమాలు చేసుకుంటూ బిజీగా మారిపోయారు.
తనకు పాలిటిక్స్ వద్దని దూరంగా ఉన్నారు.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు.
2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్తెలుగుదేశం, బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు.ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు.
పవన్ రెండు చోట్ల పోటీ చేయగా.రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు.
జనసేన నుంచి రాపాక వరప్రసాద్ మాత్రం స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.ప్రస్తుతం ఆయన వైసీపీకి సపోర్టర్‌గా మారారు.
ఇక రాబోయే ఎన్నికల్లో తమ్ముడు పవన్‌కు చిరంజీవి ఆశీసులు ఉంటాయని తెలుస్తోంది.అందులో భాగాంగానే ఈ మధ్యకాలంలో చిరు కామెంట్స్ ఉంటున్నాయి.
పవన్ ఎప్పుడు ప్రజల్లో గుండెల్లో ఉంటాడని, వాడికి రాజకీయాల కంటే సేవ చేయడమే తెలుసునని చెప్పాడు.
దీంతో రాబోయే ఎన్నికల్లో పవన్ తరఫున చిరు ప్రచారంలోకి వస్తారని.చిరుతో పాటు మెగా హీరోలు కూడా పవన్ కోసం వస్తారని టాక్ వినిపిస్తోంది.