ప్రభాస్ స్పిరిట్ మూవీలో ఆ పాత్రలో మెగాస్టార్ నటిస్తున్నారట.. కానీ?

టాలీవుడ్ హీరో ప్రభాస్ ( Hero Prabhas )గురించి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

సినిమా ఇండస్ట్రీలో మరే హీరో నటించని విధంగా వరుసగా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్.

అలా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు ఆరు పాన్ ఇండియా సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.

వాటిలో స్పిరిట్ సినిమా( Spirit Movie ) కూడా ఒకటి.సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

"""/" / ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

అదేమిటంటే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి( Malayalam Megastar Mammootty ) కూడా ఈ సినిమాలోఒక ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

ఇప్పటికే, స్టార్ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ స్పిరిట్ లో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇప్పుడు మమ్ముట్టి పేరు కూడా వినిపిస్తోంది.కానీ మూవీ మేకర్స్ నుంచిమాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది.దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్‌ సినిమా రాబోతోంది.

"""/" / స్పిరిట్‌ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని, సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని టాక్.

అలాగే సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ వైల్డ్ ఎలిమెంట్స్ సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది.

దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌ తో ఈ సినిమా తెరకెక్కనుందట.

హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టి సిరీస్ భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది.

బిగ్ బాస్ హౌస్ నుంచి గంగవ్వ బయటకు వెళ్లిపోయారా.. ఎలిమినేషన్ కు కారణాలివేనా?