వైరల్ గా మారిన మెగాస్టార్ మనవరాలు ఫోటోలు!

మెగాస్టార్ చిరంజీవి గారాలపట్టి శ్రీజ గురించి అందరికీ తెలిసిన విషయమే.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండి,వారి కుటుంబానికి సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటారు.

ఇక తాజాగా జరిగిన నిహారిక వివాహంలో శ్రీజ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

నిహారిక పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ, తన అభిమానులను అలరించారు.

ఇవి మాత్రమే కాకుండా లాక్ డౌన్ సమయంలో కూడా ఎప్పుడు అభిమానులకు దగ్గరగా ఉండేది.

తాజాగా మెగా కుటుంబం అంతా క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.క్రిస్మస్ సందర్భంగా రామ్ చరణ్ ఇచ్చిన క్రిస్మస్ వేడుకలలో మెగా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

శ్రీజ తన ఇద్దరు కూతుర్లు తన భర్తతో కలిసి ఈ వేడుకలు ఎంతో ఎంజాయ్ చేసారు.

అంతేకాకుండా శ్రీజ తన ఇంట్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ఆ ఫోటోలలో శ్రీజ చిన్న కూతురు నవిష్క అందరినీ ఆకట్టుకుంది. """/"/ నవిష్క పుట్టినప్పటినుంచి పెద్దగా ఎవరికీ పరిచయం చేయలేని శ్రీజ, క్రిస్మస్ సందర్భంగా నవిష్క ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బాగా వైరల్ అయ్యాయి.

ఇంతకుముందు నవిష్క అన్నప్రాసన వీడియో,లాక్ డౌన్ సమయంలో మెగాస్టార్ తో కలసి మిమ్మీ మిమ్మిమ్మీ సాంగ్ పెట్టాలని, తన తాతయ్య తో కలిసి అల్లరి చేసిన ఆ వీడియో రూపంలో నవిష్కను చూపించారు.

ఈ క్రిస్మస్ వేడుకలు శ్రీజ తన భర్త ఇద్దరు కూతుళ్లుతో దిగిన ఫోటోలు, నవిష్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పీఎస్ ఎదుట నిరసన.. ఉద్రిక్తత