కెమెరామెన్ కు ఆర్థికసాయం చేసిన మెగాస్టార్…మంచి మనసు చాటుకున్న చిరు!

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అంచలంచెలుగా ఇండస్ట్రీలో ఎదుగుతూ నేడు మెగాస్టార్ బిరుదుతో వెలుగొందుతున్నారు.

ఇలా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా మంచి గుర్తింపు పొందడమే కాకుండా,సినిమా ఇండస్ట్రీని తన కుటుంబంగా భావించిన చిరంజీవి ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కానీ కార్మికులు కానీ ఆపదలో ఉన్నారు అంటే ఏమాత్రం ఆలోచించకుండా వారికి తనదైన శైలిలో సహాయం చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు.

"""/"/ ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి ప్రాణదానం చేశారు.కరోనా సమయంలో ఎంతోమంది కార్మికులకు అండగా నిలిచారు.

అలాగే ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకువచ్చి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టారు.ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి చేసిన సహాయ సహకారాలు ఎన్నో ఉన్నాయి.

ఇకపోతే తాజాగా సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.ఈయన చిరంజీవి నటించిన నాగు, పులి, బెబ్బులి, రాణి కాసుల రంగమ్మ వంటి సినిమాలకు కెమెరామెన్ గా వ్యవహరించారు.

"""/"/ సుమారు 30 సంవత్సరాల క్రితం చిరంజీవి సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసిన దేవరాజ్ ప్రస్తుతం వయసు పై పడటంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

అయితే ఈయన ఆర్థిక ఇబ్బందులను ఈయన పరిస్థితిలను తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఈయనకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.

ఇలా 30 సంవత్సరాల క్రితం తన సినిమాలకు పనిచేసిన ఒక వ్యక్తి ఆపదలో ఉన్నారని తెలిసి చిరంజీవి ఆయనకు అండగా నిలవడంతో అభిమానులు చిరంజీవి మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్