‘మెగా157’ టైటిల్ ఏంటో తెలుసా.. దానినే ఫిక్స్ చేయనున్న మేకర్స్!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) చేతిలో ప్రెజెంట్ రెండు సినిమాలు ఉన్నాయి.

156, 157 సినిమాలను ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.మొన్నటి వరకు ఈయన కెరీర్ స్పీడ్ గానే కొనసాగగా ఈ మధ్య మళ్ళీ డల్ అయ్యాడు.

భోళా శంకర్ ( Bholaa Shankar )రిలీజ్ తర్వాత మెగాస్టార్ కు భారీ షాక్ తగిలింది.

అందుకే ఈ సినిమా తర్వాత ఆచితూచి అడుగులు వేస్తూ భోళా వంటి ప్లాప్ ను మరోసారి రిపీట్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యారు.

"""/" / మెగాస్టార్ చిరంజీవి ఆగస్టులో తన పుట్టిన రోజు నాడు రెండు కొత్త ప్రాజెక్టులను ప్రకటించగా అందులో''మెగా 157'' ఒకటి.

ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

ఇక ఈ సినిమాను బింబిసార డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి ( Director Mallidi Vassishta )తెరకెక్కిస్తున్న విషయం విదితమే.

బింబిసార వంటి హిట్ అందుకున్న వసిష్ఠ మెగాస్టార్ తో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాను తీయబోతున్నట్టు తెలుస్తుంది.

పంచభూతాల కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు.

అలాగే ఈసారి ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ కంపెనీ పని చేయనుందని సమాచారం.

సోషియో ఫాంటసీ జోనర్ లో సాగుతూ అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఈ సినిమాను తెరకెక్కించ బోతున్నారు.

త్వరలోనే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో మెగాస్టార్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని అంటున్నారు.

"""/" / ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.

''ముల్లోక వీరుడు'' అనే టైటిల్ ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్టు టాక్.

కాగా ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా అనుష్క శెట్టిని( Anushka Shetty ) తీసుకోనున్నట్టు టాక్.

ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఫాస్ట్ గా పూర్తి చేసి వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.