‘మెగా 156’.. ఐదుగురు హీరోయిన్లా.. హైప్ అలా పెంచేస్తున్నారుగా..
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) ఒకేసారి రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ రెండు సినిమాల్లో 156వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
"""/" /
ఇక ఈ సినిమాను బింబిసార వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి ( Director Mallidi Vassishta ) తెరకెక్కిస్తున్న విషయం విదితమే.
పంచభూతాల కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా నవంబర్ నుండి రెగ్యురల్ షూట్ స్టార్ట్ కానుంది.
అయితే తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.
"""/" /
ఈ సినిమాలో మొత్తంగా ఐదుగురు భామలను ఫిక్స్ చేయబోతున్నారు అని టాక్.
ఇప్పటికే ఈ సినిమా కోసం సీనియర్ కథానాయికల పేర్లు తెరమీదకు వచ్చాయి.అనుష్క, నయనతార, కాజల్ అగర్వాల్, త్రిష ఇలా చాలా మంది పేర్లు వచ్చాయి.
అయితే కథ డిమాండ్ చేయడంతో మొత్తంగా ఐదుగురు హీరోయిన్లను రంగంలోకి దించబోతున్నట్టు టాక్.
పాతాళ లోకాల్లో ఒక పాప చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ కథతో ఈ సినిమా సాగుతుందని అందుకే ఇంత మంది హీరోయిన్లు ఇందులో భాగం కానున్నారని సమాచారం.
మరి ఈ ఐదుగురిని ఎవరెవరిని ఎంపిక చేస్తారు ? అనే విషయంలో ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
అలాగే ఇందులో విలన్ రోల్ లో రానా దగ్గుబాటి నటిస్తున్నట్టు కూడా వార్తలు వైరల్ అయ్యాయి.
మరి ఇలా రోజుకొక వార్త వైరల్ అవుతూనే ఉన్న నేపథ్యంలో మేకర్స్ అఫిషియల్ అప్డేట్ ఇచ్చే వరకు ఇలా సాగుతూనే ఉంటుంది.
ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2025 సంక్రాంతి టార్గెట్ గా ఆడియెన్స్ ముందుకు తీసుకు రావాలని ఇప్పటికే ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది.
చూడాలి ఈ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో.
ట్రంప్ ఆ ప్లాన్ ప్రకటించగానే.. నవ్వు ఆపుకోలేకపోయిన హిల్లరీ క్లింటన్!