గ్యాంగ్ లీడర్ వర్సెస్ వాల్తేరు వీరయ్య.. మెగా పిక్ వైరల్!
TeluguStop.com

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.


ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.


గాడ్ ఫాదర్ వంటి రీమేక్ సినిమా తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య.
మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే చాలా అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.2023 జనవరి 13న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.
ఇక ఇదిలా తాజాగా మెగాస్టార్ ఫ్యాన్స్ ఈ సినిమాలోని ఒక పిక్ ను వైరల్ చేసేస్తున్నారు.
వాల్తేరు వీరయ్య నుండి ఈ మధ్యనే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి బాగా ఆకట్టు కుంటున్నాయి.
"""/"/
ఇక ఈ సినిమా టైటిల్ సాంగ్ అయిన మూడవ సాంగ్ ను డిసెంబర్ 26న అంటే రేపు రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.
కాగా మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించగా ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరుకు సంబంధించిన మరో మాస్ లుక్ రివీల్ చేసారు.
మెగాస్టార్ చేతిలో ఫైర్ పట్టుకుని ఉన్న ఈ పోస్టర్ నిన్నటి నుండి నెట్టింట వైరల్ అవుతుంది.
మరి ఇదే మాదిరి పిక్ గతంలో మెగాస్టార్ నటించిన గ్యాంగ్ లీడర్ విడుదల సమయంలో కూడా వచ్చింది.
దీంతో ఈ రెండు ఫోటోలను కంపేర్ చేస్తూ ఎడిట్ చేసి పిక్ వైరల్ చేస్తున్నారు.
మెగాస్టార్ కు టైం గ్యాప్ మాత్రమే వచ్చిందని.టైమింగ్ లో గ్యాప్ రాలేదని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మాస్క్‌తో మీ షార్ట్ హెయిర్ లాంగ్ అవ్వడం పక్కా..!