హనుమంతుడి రోల్ లో నటించబోతున్న మెగాస్టార్ చిరంజీవి..ఫ్యాన్స్ కి ఇక పండగే!

చిరంజీవి కి( Chiranjeevi ) బాగా ఇష్టమైన దైవం ఆంజనేయ స్వామి అనే విషయం అందరికీ తెలిసిందే.

కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే ఆయన పేరు ని ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత చిరంజీవి అని మార్చుకున్నాడు.

ఒకరోజు కలలో స్వయంగా ఆంజనేయ స్వామి కనిపించి ఈ పేరు ని పెట్టుకోమని సూచించినట్టు చిరంజీవి అనేక సందర్భాలలో తెలిపాడు.

అందుకే తన ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టాలని చూసిన ముందుగా ఆంజనేయ స్వామి కి( Anjaneya Swamy ) మొక్కుకున్న తర్వాతే ఏదైనా చేస్తాడు.

కేవలం ఆయన మాత్రమే కాదు, ఆయన కుటుంబం మొత్తం కూడా ఆంజనేయ స్వామి ని తమ ఇంటికి దైవంగా భావిస్తారు.

పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ కార్యక్రమం తలపెట్టినప్పుడల్లా కొండగట్టు లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేయించనిదే ముందుకు కదలడు.

ఇదంతా పక్కన పెడితే చిరంజీవి ఇన్ని సంవత్సరాల సినీ కెరీర్ లో ఒక్కసారి కూడా ఆంజనేయ స్వామి పాత్రని చెయ్యలేదు.

"""/" / కొన్ని కొన్ని సినిమాలలో చిన్న షాట్స్ లో ఆంజనేయ స్వామి గెటప్ వేసాడు కానీ, పూర్తి స్థాయిలో ఆంజనేయ స్వామిగా ఇప్పటి వరకు ఆయన కనిపించలేదు.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న 'హనుమాన్' చిత్రం లో( HanuMan Movie ) మెగాస్టార్ చిరంజీవి ని ఆ చిత్ర దర్శకుడు హనుమాన్ పాత్రలో నటించాల్సిందిగా కోరాడట.

ఇప్పటి వరకు ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయని, కేవలం హనుమంతుడికి సంబంధించిన కొన్ని షాట్స్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయని తెలుస్తుంది.

ఈ పాత్ర కి చిరంజీవి గారు అయితే సరిగ్గా సరిపోతుంది, ఆయన కూడా తన కెరీర్ లో ఈ పాత్ర తో సినిమా చెయ్యలేదు.

అందుకే ఈ పాత్రకి ఆయన మాత్రమే న్యాయం చెయ్యగలడు అని చిరంజీవి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బలంగా నమ్ముతున్నాడట.

మరి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి. """/" / ఈ పాత్ర కోసం చిరంజీవి కేవలం పది రోజుల కాల్ షీట్స్ ఇస్తే సరిపోతుందట.

అందుకు సంబంధించిన చర్చలు కూడా ఇప్పటికే జరిగిపోయినట్టు సమాచారం.మరి మెగాస్టార్ ఈ పాత్ర చేసేందుకు ఫైనల్ అప్రూవల్ ఇస్తాడో లేదో చూడాలి.

చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వం లో చేస్తున్న 'భోళా శంకర్'( Bhola Shankar ) మూవీ రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గానే పూర్తి అయ్యింది.

ఆగష్టు 11 వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు టైటిల్ సాంగ్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరి సినిమా అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో లేదో చూడాలి.

ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలివే.. క్రేజీ సినిమాలే ఈ జాబితాలో ఉన్నాయిగా!