వెంకీ కి చిరు సలహాలు..!

మెగాస్టార్ చిరంజీవి వెంకీ కుడుముల డైరక్షన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా గురించి నిన్న మొన్నటిదాకా రకరకాల రూమర్స్ రాగా ఈ ప్రాజెక్ట్ దాదాపు ఫిక్స్ అయినట్టే.

ఛలో, భీష్మ సినిమాలతో సత్తా చాటిన వెంకీ కుడుముల తన థర్డ్ మూవీని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు.

ఈ సినిమాకు సంబందించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.సినిమా డిస్కషన్ లో చిరు వెంకీకి సలహా ఇచ్చాడట.

సినిమా కథ అంతా బాగానే ఉండగా ఫస్ట్ హాఫ్ ఇంప్రెసివ్ గా ఉండగా సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా ఇంకా బాగా రావాలని అన్నారట.

సెకండ్ హాఫ్ మార్చి తీసుకుని రమ్మని వెంకీకి చిరు సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఓ మెగా అభిమానిగా చిరుని ఎలా చూపించాలో వెంకీ కుడుముల బాగా హోం వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

చేసిన రెండు సినిమాలతోనే వెంకీ తన మార్క్ చూపించగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా మాత్రం నెక్స్ట్ లేల్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ ప్రాజెక్ట్ ని త్వరలోనే ఎనౌన్స్ చేస్తారని అంటున్నారు.ఆల్రెడీ మెగాస్టార్ భోళా శంకర్, గాడ్ ఫాదర్, వాళ్తేరు వీరయ్య సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.

ఈ సినిమాలు పూర్తి కాగానే వెంకీ సినిమా మొదలవుతుందని తెలుస్తుంది.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!