Chiranjeevi School Certificate : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిరంజీవి స్కూల్ సర్టిఫికెట్.. మెగాస్టార్ ఎక్కడ పుట్టారో తెలుసా?

స్టార్ హీరో చిరంజీవి( Chiranjeevi ) అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే సంగతి తెలిసిందే.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి స్వయంకృషితో కెరీర్ పరంగా ఎదగడంతో పాటు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.

నాలుగు దశాబ్దాలకు పైగా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న చిరంజీవిని అభిమానించే అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు.

చిరంజీవి పదో తరగతికి సంబంధించిన సర్టిఫికెట్( SSC Certificate ) ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఆ సర్టిఫికెట్ లోని వివరాల ప్రకారం చిరంజీవి 1955 సంవత్సరం ఆగష్టు నెల 22వ తేదీన పెనుగొండలో ( Penugonda ) జన్మించినట్టుగా వివరాలు ఉన్నాయి.

ఈ సర్టిఫికెట్ లో పేరు కే.ఎస్.

ఎస్.వరప్రసాదరావు అని ఉంది.

ఈ సర్టిఫికెట్ లో ఉన్న పాఠశాల మాత్రం మొగల్తూరులో ఉన్నట్టు తెలుస్తోంది.ఈ సర్టిఫికెట్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఆ ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

"""/" / వైరల్ అవుతున్న సర్టిఫికెట్ నిజమో కాదో తెలియాలంటే మాత్రం మెగాస్టార్ చిరంజీవి స్పందించే వరకు ఆగాల్సిందే.

చిరంజీవి ప్రాజెక్ట్ ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ప్రస్తుతం విశ్వంభర( Vishwambhara ) మినహా చిరంజీవి మరో సినిమాలో నటించడం లేదనే సంగతి తెలిసిందే.

విశ్వంభర సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.విశ్వంభర సినిమాలో త్రిష( Trisha ) హీరోయిన్ గా నటిస్తున్నారు.

"""/" / విశంభర సినిమాలో విజువల్ ఎఫెక్స్ట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది.

విశ్వంభర సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుండగా యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం అందుతోంది.

ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసమే భారీ స్థాయిలో ఖర్చు అవుతున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

ఆ స్టార్ హీరోలకు ధీటుగా మోక్షజ్ఞ సక్సెస్ కావడం సాధ్యమేనా.. చరణ్ తర్వాత ఇతనేనంటూ?