లేటుగా వచ్చినా లేటెస్ట్ అనిపించిన మెగాస్టార్

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి రోజుకో వార్త మనం వింటున్నాం.

ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.ఈ వైరస్ సోకకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి అనే అంశాలపై ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

కాగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ముందుకు వస్తున్నారు.

ఇటీవల టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు.

ఇందులో తాము కూడా ముందున్నామంటూ ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, తారక్‌లు ఓ వీడియో ద్వారా మనముందుకు వచ్చారు.

కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ తరహా వీడియోతో ప్రజల ముందుకు వచ్చారు.

ప్రజలు ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండాలని, జన సమూహానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

కరోనా వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వివరించారు.ఇలా ప్రజలను అప్రమత్తం చేయడంలో తాను కూడా ముందుంటానని మెగాస్టార్ మరోసారి నిరూపించుకున్నారు.

కాగా ప్రజలు అందరూ ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇదని ఆయన అన్నారు.

కాశ్మీర్ వేర్పాటువాద జెండాలను అనుమతించొద్దు : రట్జర్స్ వర్సిటీకి ప్రవాస భారతీయ సంఘాల విజ్ఞప్తి