ఇంద్రసేనా రెడ్డి అంటూ ఇంద్ర రీ రిలీజ్ పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో చిరంజీవి( Chiranjeevi ) ఒకరు.
ఈయన ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు.
చిరంజీవి కెరియర్ లో ఎన్నో కుటుంబ కథా చిత్రాలతో పాటు యాక్షన్స్ సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా చిరంజీవి నటించిన యాక్షన్ సినిమాలలో ఇంద్ర ( Indra ) సినిమా కూడా ఒకటి.
చిరంజీవి ఆర్తి అగర్వాల్ సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
"""/" /
అప్పట్లో ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా ఆగస్టు 22వ తేదీ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా తిరిగి విడుదలవుతున్న నేపథ్యంలో ఇంద్ర సినిమా గురించి చిరంజీవి ఒక వీడియోని విడుదల చేశారు.
ఇందులో భాగంగా ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇంద్ర తిరిగి విడుదలవుతున్న తరుణంలో చిరంజీవి స్పందిస్తూ ఇంద్రసేనారెడ్డి ఈ పేరు పలకగానే ఇప్పటికి నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.
అంత పవర్ ఫుల్ సినిమా, అంత పెద్ద హిట్ అయిన సినిమా. """/" /
ఈ సినిమా ఇలాంటి సక్సెస్ అందుకోవడానికి కారణం కథేనని తెలిపారు.
ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి పని చేశారని తెలిపారు.
ఈ సినిమా చూడటం కనుక మొదలు పెడితే సినిమా పూర్తి అయ్యేవరకు ఎవరు కూడా పక్కకు లేయరు.
నా సినిమాల్లో అత్యంత సాంకేతిక విలువలు ఉన్న కమర్షియల్ సినిమా ఇంద్ర.ఈ సినిమాలో అన్నీ పీక్స్ లో ఉంటాయి.
కమర్షియల్ సినిమాకు పర్ఫెక్ట్ సినిమా ఇంద్ర.నిర్మాత, నాకు నచ్చిన వ్యక్తి అశ్వినీదత్ గారికి ఇతర చిత్ర బృందానికి ఈయన ధన్యవాదాలు తెలియజేశారు.