Chiranjeevi : పద్మవిభూషణ్ రావడం గురించి స్పందించిన చిరంజీవి.. ఏం మాట్లాడాలో తెలియడం లేదంటూ?
TeluguStop.com
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi )కి తాజాగా మరొక అరుదైన గౌరవం దక్కింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది.ఇప్పటికే అవార్డుల రారాజుగా నిలిచిన మెగాస్టార్‌కు మరో అత్యున్నతమైన ఘనతను సొంతం చేసుకున్నారు.
దీంతో మెగాస్టార్ కు ఈ అదృష్టం వరించడంతో అభిమానులు కుటుంబ సభ్యులు రాజకీయ నాయకుడు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే ఈ పద్మవిభూషణ్ అవార్డు రావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి కూడా ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో ని కూడా విడుదల చేశారు.
"""/" /
ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?చిరంజీవి ఎలా స్పందించారో అన్న వివరాల్లోకి వెళితే.
ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్( Padma Vibhushan ) ప్రకటించింది.
ఈ సమయంలో నాకు తెలీదు.ఏం మాట్లాడాలో కూడా మాటలు రావడం లేదు.
మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబ సభ్యుల అండ దండలు, నీడలా నాతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగా నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.
"""/" /
నాకు దక్కిన ఈ గౌరవం మీది.మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతల కు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను.
నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తిమేరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను.
"""/" /
నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరం అయినప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా.
మీరు నా పై చూపిస్తున్నకొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తుంది గోరంతే.ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది.
నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది.పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi ) గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు అని వీడియోలో చెప్పుకొచ్చారు మెగాస్టార్.
తండేల్ క్లైమాక్స్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారా..?