గాడ్ ఫాదర్ అలా వద్దనుకున్న మెగాస్టార్..!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరక్షన్ లో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్.
మళయాళ మూవీ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నాడు.
సినిమాలో సల్మాన్ ఉండటం సౌత్ ఆడియన్స్ తో పాటుగా నార్త్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.
అందుకే ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.గాడ్ ఫాదర్ సినిమా ని హిందీ రిలీజ్ ఆఫర్లు కూడా భారీగా వస్తున్నాయట.
అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం అందుకు నో అంటున్నారట.ఆచార్యతో నిరాశపరచిన చిరు గాడ్ ఫాదర్ తో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నారు.
అందుకే సినిమాలో కావాల్సిన అన్ని అంశాలు పెడుతున్నారు.అయితే ఈమధ్య తెలుగు సినిమాలన్ని బాలీవుడ్ లో సక్సెస్ అవుతున్నాయి.
అలా అని గాడ్ ఫాదర్ ని కూడా అక్కడ రిలీజ్ చేయాలని ప్రపోజల్స్ రాగా చిరు వాటిని తోసి పుచ్చారట.
మాత్రుక సినిమా లూసిఫర్ ఆల్రెడీ హిందీ వర్షన్ ఓటీటీలో ఉంది కాబట్టి హిందె ఆడియన్స్ ఈ సినిమా మీద ఆసక్తి చూపించకపోవచ్చని మెగాస్టార్ చెప్పారట.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్21, శనివారం 2024