చిరు సినిమా.. మరీ ఇన్ని పుకార్లు ఏంట్రా బాబు!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) నటిస్తున్న భోళా శంకర్ సినిమా ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందిన భోళా శంకర్ సినిమా విడుదల అవ్వక ముందే చిరంజీవి తదుపరి సినిమా ను మొదలు పెట్టే విధంగా ప్లాన్ చేశారు.

కానీ ఇప్పటి వరకు చిరు తదుపరి సినిమా ఏంటి అనేది కన్ఫర్మ్‌ అవ్వలేదు.

ఆ మధ్య సోగ్గాడే చిన్ని నాయన సినిమా దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ( Director Kalyan Krishna ) దర్శకత్వం లో చిరంజీవి సినిమా ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

"""/"/ సినిమా యొక్క అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని అంతా భావిస్తున్న సమయంలోనే ఇప్పటి వరకు అసలు ప్రాజెక్ట్‌ కన్ఫర్మ్‌ అయ్యిందా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవలే బింబిసార దర్శకుడికి( Bimbisara Director ) చిరంజీవి ఓకే చెప్పాడు అని ఆ సినిమా రాబోతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ నేపథ్యం లో చిరంజీవి తదుపరి సినిమా విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్‌ అవుతోంది.

పుకార్ల విషయంలో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో చిరంజీవి సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న కారణంగా భోళా శంకర్ సినిమా విడుదల అయిన తర్వాత మాత్రమే చిరంజీవి సినిమా కు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని మెగా కాంపౌండ్ నుండి ప్రకటన వచ్చింది.

"""/"/ అతి త్వరలోనే చిరంజీవి సినిమా భోళా శంకర్ సినిమా( Bhola Shankar ) యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అవ్వబోతున్నాయి.

టీజర్ ను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.జులై మొదటి లేదా రెండవ వారంలో సినిమా యొక్క టీజర్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది.

మొత్తానికి చిరంజీవి సినిమా అంటే అభిమానుల్లో ఏ స్థాయి లో చర్చ జరుగుతుందో మరోసారి దీంతో నిరూపితం అయ్యింది.

చిరంజీవి సినిమా ల కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న నేపథ్యం లో జాగ్రత్తగా సినిమాల ఎంపిక చేసుకుంటే మంచిది.

జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలా.. అయితే ఈ సీరంను ట్రై చేయండి!